జమ్ముకశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో రెండు నెలల క్రితం 8 ఏళ్ళ ముస్లిం బాలికను కొందరు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం నమోదు చేసిన ఈ ఘటనపై ఇప్పటికే జమ్ము కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించి చట్టంలో మార్పులు చేసి.. నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఇదే సంఘటనపై శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మాట్లాడారు. "ఈ ఘటన నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఇలా చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించాలి అన్నది నా అభిప్రాయం.. ఈ విషయాన్ని నేను కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను.. 12ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావాల్సిందే" అని ఆమె తెలిపారు. 


ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో జరిగిన చిన్నారి అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో యూట్యూబ్‌లో పెట్టారు. ఆ తర్వాత దానిని డిలీట్ చేశారు. ఇదే ఘటనపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను కొన్ని పార్టీల నేతలు రక్షించాలని చూస్తున్నారని.. అలాంటి వారు ఇలాంటి పనులకు స్వస్తి పలకాలని ఆయన తెలిపారు.


పుజ్వాలాది ముస్లింలలో గుజ్జర్‌ సముదాయానికి చెందిన 8 ఏళ్ల బాలిక జనవరి 10వ తేదిన ఇంటి నుండి కనిపించకుండా పోయింది. తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. అప్పుడు గుజ్జర్ల సంఘాల వారందరూ ఏకమై.. పాప కోసం వెతకడం మొదలుపెట్టగా.. ఆఖరికి ఆమె శవం దొరికింది. ఈ కేసులో ఓ పోలీసుతో పాటు ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగిపై కూడా ఆరోపణలు ఉన్నాయి