రాష్ట్రంలో బంపర్ విక్టరీ సాధించిన కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టిపెడతామని ప్రకటించారు. టీఆర్ఎస్ విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జాతీయ రాజకీయాలపై ఆయన స్పందిస్తూ దేశంలో కాంగ్రెస్- బీజేయేతర ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సి ఆవశ్యకత ఉందన్నారు. ఇప్పటికే ఈ విషయంలో మమత, మాయావతి,నవీన్ పట్నాయక్ తదితరలును కలిశామన్నారు. భవిష్యత్తులో మరింత మంది జాతీయ నాయకులు కలుస్తామన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 నాటికి పెడరల్ ఫ్రంట్ కు ఒక రూపం ఇస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. రైతుల విషయంలో సరైన విధానాలు రావాల్సి ఉందని.. ఆర్ధిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉందన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని.. ఇదే పంథాను బీజేపీ అనుసరిస్తోందని.. అందుకే తాము విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఫెడరల్ ఫ్రంట్ అవసరముందని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.


బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీయేతర ఫ్రంట్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్- బీజేయేతర ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నించడం గమనార్హం. ఈ ఇద్దరు చంద్రుల ప్రయత్నాల్లో ఏది ఫలిస్తోందో వేచి చూడాల్సిందే మరి.