తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై  దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీతో సహా దేశంలోని పలు రాష్ట్రాలు చుట్టేస్తున్నారు. ఒకనోక సందర్భంలో అవసరమైతే జాతీయ పార్టీని సైతం స్థాపింస్తామన్న కేసీఆర్...  భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పార్టీ ఆఫీసును ప్రారంభించాలని నిర్ణయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలు ఇందులోనే  నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది.


కాగా పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్థలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాగా పార్టీ కార్యాలయం కోసం అక్కడి ప్రభుత్వం వెయ్యి గజాల స్థలం కేటాయించడానికి అంగీకరించినట్లు సమాచారం. నూతన జాతీయ పార్టీ స్థాయించి దానికి దానికి కార్యాలయంగా ఉపయోంచుకుంటారా లేదంటే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకుంటారా అనే విషయం తేలాల్సి ఉంది.