CM KCR:కేసీఆర్ ఆ పని చేస్తే రేవంత్ రెడ్డికి గండమే..? తెలంగాణలో ఏం జరగబోతోంది..
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. సీఎం కేసీఆర్ టార్టెట్ గా దూకుడుగా వెళుతున్న టీపీసీసీ నేతలకు అనుకోని అవాంతరం ఎదరయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇది పెద్ద గండమే. తెలంగాణ కాంగ్రెస్ ను ఇంతగా భయపెడుతున్నది కేసీఆరే.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. సీఎం కేసీఆర్ టార్టెట్ గా దూకుడుగా వెళుతున్న టీపీసీసీ నేతలకు అనుకోని అవాంతరం ఎదరయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇది పెద్ద గండమే. తెలంగాణ కాంగ్రెస్ ను ఇంతగా భయపెడుతున్నది కేసీఆరే. గులాబీ బాస్ ఆ పని చేస్తే రేవంత్ రెడ్డి నోరు మూసుకోవాల్సిందేనని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు జరగడం ఖాయం.
రాష్ట్రపతి ఎన్నికలు దేశంలో కాక రేపుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా పోటీగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జూన్ 15న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీయేతర పార్టీల నేతలను ఆహ్వానించారు. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మొత్తం 22 మంది నేతలకు మమత నుంచి పిలుపిచ్చోంది. ఇందులో కాంగ్రెస్ చీఫ్ అధినేత్రి సోనియా గాంధీతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. కొన్ని రోజులుగా బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తి దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ రెండు పార్టీలతో దేశానికి నష్టమని చెబుతున్నారు. కాని ఇప్పుడు మమత సమావేశానికి సోనియాతో పాటు కేసీఆర్ పిలుపురావడం ఆసక్తిగా మారింది.
మమత బెనర్జీ సమావేశానికి సోనియా వస్తున్నందున కేసీఆర్ వెళతారా లేదా అన్నది కీలకంగా మారింది. మమతతో కేసీఆర్ కు మంచి సంబంధాలున్నాయి. మమత స్వయంగా కాల్ చేసినట్లు మాట్లాడినందున కేసీఆర్ సమావేశానికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్ కు ఇబ్బందే. కేసీఆర్ టార్గెట్ గానే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి రాజకీయం చేస్తున్నారు.కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనని ఆరోపిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని పీసీసీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ కూడా టీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధాలు ఉండవని తేల్చి చెప్పారు. కాని ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు మరోలా ఉండటం తెలంగాణ కాంగ్రెస్ నేతలను కలవరపరుస్తోంది.
సానియా గాంధీతో కలిసి కేసీఆర్ సమావేశంలో పాల్గొంటే బీజేపీకి అస్త్రంగా మారనుంది. తాము చెప్పిందే జరిగిందని ప్రచారం చేసే అవకాశం ఉంది. కేసీఆర్ లక్ష్యంగానే ఉద్యమిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇది మింగుపడని అంశం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పని చేసే పార్టీతో రాష్ట్రంలో పోరాటం చేయడం ఇబ్బందిగా మారనుంది. ఈ అంశమే ఇప్పుడు రేవంత్ రెడ్డితో పీసీసీ నేతలకు ఆందోళన కల్గిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి కేసీఆర్ మద్దతు ఇస్తే రాష్ట్రంలో తమ పని అయిపోయినట్టేనని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అందుకే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలకు రేవంత్ రెడ్డి వర్గీయులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Read also: Mamata letter to oppositions: మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!
Read also: Prathyusha Garimella: హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష బలవన్మరణం..కారణాలు ఇవేనా..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి