Fuel prices: ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఓ వైపు పెట్రోల్ డీజిల్ ధరలు.మరోవైపు వంట గ్యాస్ ధర భారీగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో అంశాలైనా సరే గెలిస్తే లీటర్ పెట్రోల్ 60 రూపాయలకు అందిస్తామని ప్రచారం చేస్తోంది బీజేపీ. ఎక్కడో తెలుసా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఇంధన ధరలే ప్రచారాస్త్రాలుగా మారాయి. బీజేపీ యేతర పార్టీలు ఇంధన ధరల్ని ప్రచారాస్త్రాలుగా చేసుకుంటే ఆశ్చర్యం లేదు గానీ..బీజేపీ సైతం ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకోవడం విడ్డూరంగా ఉంది. పెట్రో, డీజిల్ ధరలతో పాటు వంటగ్యాస్ ధరలు భారీగా పెరగడంతో ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శీతాకాలం దాటాక ధరలు నియంత్రణలో వస్తాయని సమాధానం కూడా చెబుతున్నారు బీజేపీ కేంద్ర మంత్రులు. ఈ నేపధ్యంలో కేరళ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మల్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది.


రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే లీటర్ పెట్రోల్ ధర 60 రూపాయలకే అందిస్తామని కేరళ బీజేపీ లీడర్ రాజశేఖరన్ ప్రచారం చేస్తున్నారు. జీఎస్టీ లాంటి ట్యాక్సులన్నీ లోబడే ఈ ధర ఉంటుందని అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ను కూడా జీఎస్టీ పరిధిలోకి చేరుస్తామని అంటున్నారు. ఓ వైపు ఇంధన ధరలు ఆకాశాన్నంటడంపై దేశమంతా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో...అదే పార్టీ ఓ రాష్ట్రంలో అధికారంలో వస్తే లీటర్ పెట్రోల్ ధర 60 రూపాయలకే అందిస్తాననడం చర్చనీయాంశంగా మారింది.  రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే వంద రూపాయలు దాటేసింది. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలో చేర్చేది కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా ఉంది.


Also read: Regulation On OTT Platforms: అశ్లీల వీడియోలు సైతం వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి Supreme Court నోటీసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook