ముస్లింలు ఆచరించే త్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చట్టం చేసింది. వివాదాస్పద త్రిపుల్ తలాక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గతంలో వివాదాస్పదమైంది. ఇప్పుడు మరోసారి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విడాకులనేవి అన్ని మతాల్లో ఉండేవేనని..అలాంటప్పుడు కేవలం ముస్లింలలో త్రిపుల్ తలాక్ మాత్రమే ఎందుకు నేరంగా పరిగణించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. ఇతర మతాల్లో విడాకుల కేసును సివిల్ కేసుగా చూస్తున్నప్పుడు..ఇస్లాంలోని త్రిపుల్ తలాక్ క్రిమినల్ కేసు ఎలా అవుతుందన్నారు. కేరళలో సీఏఏ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమలు చేయమని ముఖ్యమంత్రి విజయన్ స్పష్టం చేశారు. ఒక్కో మతానికి ఒక్కో రకమైన శిక్షను విధించవచ్చా అని ప్రశ్నించారు. ఓ మతాన్ని అనుసరించేవారికి ఒక చట్టం, మరో మతాన్ని అనుసరించేవారికి ఇంకో చట్టం ఉండవచ్చా అని నిలదీశారు. 


త్రిపుల్ తలాక్‌ను ఇప్పుడు దేశంలో క్రిమినల్ కేసుగా పరిగణిస్తూ..నేరంగా చూస్తున్నారు. ఇతర మతాల్లో విడాకుల కేసుల్ని మాత్రం సివిల్ కేసులుగా పరిగణిస్తున్నారు. ముస్లింలకు మాత్రమే నేరమెందుకు అవుతుందని ఆగ్రహించారు. దేశంలో అందరూ భారతీయులేనని..ఫలానా మతంలో పుట్టినందుకే పౌరసత్వం వస్తుందని ఎలా చెప్పగలమన్నారు. పౌరసత్వానికి మతం ప్రాతిపదిక ఎలా అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ద్వారా సిటిజెన్‌షిప్ ఇచ్చేందుకు మతాన్ని ఉపయోగిస్తుందన్నారు. రాష్ట్రంలో మాత్రం అమలు చేయబోమని తెలిపారు. 


కేశవానంధ భారతి కేసులో 13 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఓ మైలురాయి వంటి తీర్పును ప్రకటించిందని కేరళ సీఎం విజయన్ తెలిపారు. ఈ తీర్పు తమకు అనుకూలంగా లేనందునే సంఘ్ పరివార్..సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా గళం విప్పిందన్నారు. 


త్రిపుల్ తలాక్ అంటే ఏమిటి


ముస్లింలలో తలాక్..తలాక్..తలాక్ అని మూడు సార్లు ఉచ్ఛరించడం ద్వారా భార్యలకు విడాకులిచ్చే పద్ధతి. ఇది రాజ్యాంగ విరుద్ధమని 2017లో సుప్రీంకోర్టు తెలిపింది. ఆ మరుసటి ఏడాది ముస్లిం మహిళల ఆర్జినెన్స్ 2018ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా, రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పట్నించి దేశంలో త్రిపుల్ తలాక్ అనేది నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ నేరంగా మారింది. 


Also read: Twitter New Rules: ఇక ట్విట్టర్ సహాయంతో ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించే అవకాశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook