ఒడిషాకు కేరళ సర్కార్ అండ; తుపాను బాధితులకు భారీ సాయం
తుపాను బాధితులు ఆదుకునేందుకు ఇతర రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి.
ఫొని తుపాను వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఒడిషాపై విరాళాల వర్షం కురుస్తోంది. తుపాను నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఒడిశాకు కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో దాదాపు 14 వందల కోట్ల సాయాన్ని ప్రకటించింది. మరోవైపు నుంచి బాధితులను ఆదుకునేందకు ఇతర రాష్ట్రాలు కూడా ముందుకు వస్తున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం ..రూ.10 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తామని కేరళ సర్కార్ పేర్కొంది.