CM Pinarayi Vijayan Vs Governor Arif Mohammad Khan: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వివాదం ముదిరింది. ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. వీసీల నియమామంలో చెలరేగిన వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఛాన్సలర్ పదవిని అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరిస్తున్నారని సీఎం విమర్శించగా.. వీసీల నియామకాలలో రాజకీయ జోక్యాన్ని గవర్నర్ తప్పుబట్టారు. తనపై సీఎం చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులను వీసీలుగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని నేను పదేపదే ఆరోపిస్తున్నారు. నాకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి నేను ఆర్‌ఎస్‌ఎస్‌కే కాకుండా ఎవరినైనా నామినేట్ చేసి ఉంటే.. నా పదవికి నేను రాజీనామా చేస్తాను..' అని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. కేరళ సీఎం కార్యాలయం రాష్ట్రంలో స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. 


తానెప్పుడూ రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోలేదని.. ఇప్పుడు అన్ని రకాల స్మగ్లింగ్ కార్యకలాపాలకు ముఖ్యమంత్రి కార్యాలయం రక్షణ కల్పిస్తోందని గవర్నర్ అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న వ్యక్తులు తమ అనర్హులను, తమ బంధువులను నియమించుకున్నా తానేమి అనలేదన్నారు. 


కేరళ మంత్రి కె.బాలగోపాల్ తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. ముఖ్యమంత్రికి గవర్నర్ లేఖ రాశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే చర్యలు తీసుకునేందుకు సరైన కారణాలు కనిపించడం లేదంటూ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఆ తరువాత వీసీల నియామకంపై మధ్య వివాదం మొదలైంది. తాజాగా గవర్నర్ విసిరిన సవాల్‌కు ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


Also Read: Gujarat Election Schedule: గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. రెండు దశల్లో పోలింగ్


Also Read: Rajagopal Reddy: ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి.. కారణం ఇదే..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook