Kerala Court: కేరళ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది సెక్సువల్‌గా రెచ్చగొట్టే డ్రెస్సులు ధరించినప్పుడు కేసును ఎలా పరిగణించవచ్చో తెలిపింది. కేరళ కోజికోడ్ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళలోని కోజికోడ్ సెషన్స్ కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న 74 ఏళ్ల  సోషల్ యాక్టివిస్ట్ చంద్రన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కోజికోడ్ సెషన్స్ కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహిళ ఒకవేళ సెక్సువల్‌గా రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే..ఐపీసీ సెక్షన్ 354 ఏ ప్రైమా ఫేసీ కానేరదని కోజికోడ్ సెషన్ కోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 12న 74 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ చంద్రన్‌పై నమోదైన సెక్సువల్ హెరాస్‌మెంట్ కేసులో కోజికోడ్ ఆదేశాలివి. 


కేరళ కోర్టు ఏం చెప్పింది..కోర్టు మాటల్లోనే


నిందితుడి బెయిల్ దరఖాస్తుతో పాటు కొన్ని ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించారు. ఆ ఫోటోల ప్రకారం ఫిర్యాదు చేసిన మహిళ సెక్యువల్‌గా రెచ్చగొట్టే దుస్తులు ధరించి ఉంది. కావు ఐపీసీ సెక్షన్ 353 ఏ అనేది ఈ కేసులో ప్రైమా ఫేసీగా పరిగణించలేం. ఒకవేళ శారీరక సంబంధముందని అంగీకరించినా..74 ఏళ్ల వికలాంగ వృద్ధుడు బలవంతం చేశాడంటే నమ్మశక్యంగా లేదు.


కోజికోడ్ సెషన్స్ కోర్టులో నడిచిన ఈ కేసు 2020 ఫిబ్రవరి 8న జరిగింది. ఈ కేసు ప్రకారం ఫిర్యాదుదారు, మరి కొంతమంది నంది బీచ్‌లో క్యాంప్ చేశారు. నిందితుడైన చంద్రన్ ఆ మహిళ చేతులు పట్టుకుని బలవంతంగా ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడని ఉంది. ఆ తరువాత ఆమెను తన తొడపై కూర్చోమన్నాడు. ఆమెను లైంగికంగా లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. కోయిలాండీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ క్లాజ్2, 341, 353 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదంతా కల్పితమైన కేసు అని డిఫెన్స్ వాదించింది. ఫిబ్రవరి 2020లో ఇది జరిగినట్టు ఫిర్యాదులో ఉందని..కేసు రిజిస్టర్ అయింది మాత్రం జూలై 29, 2022న అని డిఫెన్స్ స్పష్టం చేసింది. 


Also read: Union Govt: రైతన్నలకు గుడ్‌న్యూస్..రుణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook