Omicron scare: కేరళలో కొవిడ్ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఒక్క రోజులో ఇక్కడ 45 ఒమిక్రాన్ (Omicron cases in Kerala) కేసులు బయటపడ్డాని రాష్ట్ర ఆరోగ్య విభాగం వెల్లడించింది. దీనితో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 152కు పెరిగినట్లు పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్ కేసుల్లో భారీ వృద్ధి..


సాధార కరోనా కేసుల్లోను భారీ వృద్ది నమోదైనట్లు ఆరోగ్య విభాగం తెలిపింది. ఆదివారం కొత్తగా (Corona cases in Kerala) 2,802 కొవిడ్ కేసులు నమోదైనట్లు వివరించింది. కొవిడ్​తో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.


పాజిటివ్​ కేసుల్లో 29 మంది ఆరోగ్య కార్యకర్తలు కాగా.. 48 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు అధికారులు. 2,595 మంది ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. 130 మందికి మాత్రం కొవిడ్​ ఎలా సోకింది అనే విషయంపై ఎలాంటి ఆధారాలు లభించలేదు.


ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 48,113 మంది కరోనాతో మృతి చెందారని ఆరోగ్య విభాగం (Corona deaths in Kerala) వెల్లడించింది. కేరళలో ప్రస్తుతం 19,180 యాక్టివ్​ కరోనా కేసులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. అందులో 10.7 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల పాలైనట్లు తెలిపింది ఆరోగ్య విభాగం.


ఇప్పటి వరకు కేరళలో మొత్తం 52,52,414 కరోనా కేసులు (Total Corona cases in Kerala) నమోదయ్యాయి. అందులో 51,84,587 మంది కోలుకున్నారు. కరోనా కేసుల వృద్ధి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతోంది. రేపటి వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో.. వివిధ రాష్ట్రాలు చర్యలకు దిగాయి. పశ్చిమ్​ బెంగాల్​ ఇప్పటికే లాక్​డౌన్ తరహా ఆంక్షలు (Corona lock down) విధించింది.


Also read: Telangana ban potatoes: ఆలుగడ్డలు రాజేసిన రాజకీయ మంట.. తెలంగాణపై యూపీ రైతుల ఆగ్రహం


Also read: Bus Ticket For Chick: కోడిపిల్లకు బస్సులో రూ.50 టికెట్.. ఆర్టీసీ కండెక్టర్ ఘనకార్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook