Kerala corona updates: కేరళలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.  వైరస్ వ్యాప్తి భయంకరంగా పెరిగిపోతోంది. మొన్నటి వరకు 20వేల కంటే తక్కువగా ఉన్న రోజువారీ కేసులు.. ఓనం పండగ తర్వాత భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా 30వేల కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ(Kerala)లో ఓనం(Onam) పండుగ తర్వాత కరోనా(Covid) ఉద్ధృతి బాగా పెరిగింది. అక్కడ వరుసగా రెండో రోజు 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గురువారం కేరళ(Kerala)లో 30,007 మందికి కరోనా నిర్ధారణ అయింది. 18,997 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ బారిన పడి 162 మంది మరణించారు. కేరళలో కోవిడ్ పాజిటివిటీ రేటు(Covid Positivity Rate) 18.03గా ఉంది. అంటే పరీక్షలు చేసిన ప్రతి 100 మందిలో 18 మందికి కరోనా పాజిటివ్(Corona Positive) గా తేలుతుంది.  రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం 1,66,397 మందికి కరోనా పరీక్షలు(Covid Tests) చేశారు. వీరిలో 30,007 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అక్కడ యాక్టివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలో ఉన్న వాటిలో సగం కేసులు కేరళలోనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో 1,81,209 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.


Also Read: Covid19 Alert: సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో మరింత జాగ్రత్త అవసరం


సెకండ్ వేవ్(Corona Second Wave)లో భాగంగా.. కేరళో మే 20న 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదేస్థాయిలో కరోనా వ్యాప్తి పెరగడం కలవరపెట్టే విషయం.  కేరళలో వైరస్ ఉద్ధృతిపై కేంద్రం కూడా దృష్టి సారించింది. అక్కడి పరిస్థితిని ఆరోగ్యశాఖ సమీక్షిస్తోంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఇంకా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజలను హెచ్చరించారు. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో అప్రమత్తత అవసరమని.. రాబోయే పండుగల(Festivals)ను కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.


మూడో వేవ్ రానుందా?
భారతదేశంలో మూడో వేవ్(Third Wave) ప్రమాదంపై ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కోరింది. అక్టోబర్ నెల నాటికి కరోనా మూడో వేవ్ ఉధృతి ఉండవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కేరళ కరోనా కేసుల(Kerala Corona Cases) నమోదు మూడో వేవ్ సంకేతంలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook