మహాత్మగాంధీ జీవిత చరిత్ర "మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ ట్రూత్" గ్రంథాన్ని ఎక్కువగా చదివే రాష్ట్రంగా కేరళ వార్తలలోకెక్కింది. నవజీవన్ ట్రస్టు సబ్సిడీ ధరపై అన్ని భారతీయ భాషల్లోనూ అనువదించి  "సత్యశోధన" పేరుతో ఈ పుస్తకాన్ని అమ్ముతోంది. ఈ పుస్తకానికి సంబంధించి గత సంవత్సరం అమ్మకాలను ట్రస్టు ప్రకటించాక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. గాంధీజీ జన్మస్థలమైన గుజరాత్ కంటే ఈ పుస్తకం, కేరళలోనే ఎక్కువగా సేల్ అవ్వడం విశేషం. గుజరాత్‌లో 6.24 లక్షలు కాపీలు అమ్ముడైతే.. హిందీలో 6.43 కాపీలు, తమిళంలో 6.99 కాపీలు అమ్ముడయ్యాయి. అయితే అన్ని రాష్ట్రాలకన్నా ఎక్కువ మొత్తం కాపీలను (7.68 లక్షలు) కేరళీయులు కొని చదవడం విశేషం. ముఖ్యంగా కేరళ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గాంధీ
జీవితచరిత్రను తప్పనిసరిగా చదవమని అక్కడి విద్యాసంస్థలు విద్యార్థులను ప్రోత్సహించడం విశేషం