Unfollow Ndtv: ఎన్డీటీవీలో కీలక పరిణామాలు, ట్రెండింగ్‌లో అన్‌ఫాలో ఎన్డీటీవీ
Unfollow Ndtv: ఎన్డీటీవీకు ఇప్పుడు అన్‌ఫాలో ట్రెండింగ్ భయం వెన్నాడుతోంది. షేర్ మార్కెట్‌లో దూసుకెళ్లినా..అన్‌ఫాలో ట్రెండ్ అవుతోంది. కీలకనేతలు, సెలెబ్రిటీలు ఎన్డీటీవీని అన్‌ఫాలో అవుతుండటం సంచలనంగా మారింది.
ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్డీటీవీలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంస్థ వ్యవస్థాపకులైన ప్రముఖ జర్నలిస్టులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పెద్ద పెద్ద నేతలు, సెలెబ్రిటీలు ఆ ఛానెల్‌ను అన్‌ఫాలో అవుతున్నారు.
అసలేం జరిగింది
ప్రఖ్యాత అదానీ గ్రూప్ ఎన్డీటీవిలో 29.18 వాటా దక్కించుకోవడంతో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ ఆర్ఆర్‌పీఆర్‌కు ఆ సంస్థ వ్యవస్థాపకులైన ప్రణయ్ రాయ్ రాధికా రాయ్లు రాజీనామా చేశారు. ఆర్ఆర్‌పీఆర్‌కు 29.18 శాతం ప్రణయ్, రాధికాలకు 33.26 శాతం వాటాలున్నాయి. న్యూస్ ఛానెల్ బోర్డు నుంచి మాత్రం ఈ ఇద్దరూ తప్పుకోలేదు కేవలం గ్రూప్ డైరెక్టర్లుగా తప్పుకున్నారు. ఈ ఇద్దరి స్థానంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సినియాలను ఆర్ఆర్‌పీఆర్ బోర్డు కొత్త డైరెక్టర్లుగా నియమించింది.
ఎందుకీ పరిస్థితి
ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకు 2009లో విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ 403 కోట్ల రుణమిచ్చింది ఆ తరువాత వీసీపీఎల్ యాజమాన్యం కాస్తా అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రుణాన్ని 29.18 శాతం వాటాగా మార్చుకుని ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటాదారుగా మారింది. అదనంగా మరో 26 శాతం వాటా కొనుగోలుకై ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ పూర్తయితే..ఎన్డీటీవీలో మెజార్టీ షేర్ అదానీ గ్రూప్‌కు దక్కుతుంది.
ట్రెండ్ అవుతున్న అన్‌ఫాలో ఎన్డీటీవీ
ఇప్పుడు ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ ఆర్‌ఆర్‌పీఆర్‌కు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ ఇద్దరూ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్‌ఫాలోయింగ్ ఎన్డీటీవీ ట్రెండింగ్ అవుతోంది. పలు రాజకీయ నేతలు, సెలెబ్రిటీలు ఎన్టీడీవీని అన్‌ఫాలో అవుతున్నట్టు ట్వీట్ చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎన్డీటీవీని అన్‌ఫాలో అవుతూ ట్వీట్ చేశారు.
షేర్ మార్కెట్‌లో దూసుకెళ్లిన ఎన్డీటీవీ షేర్
ఆర్ఆర్‌పీఆర్ గ్రూపులో చోటుచేసుకున్న పరిణామాలు, రాధికా రాయ్, ప్రణయ్ రాయ్‌ల రాజీనామాల నేపధ్యంలో షేర్ మార్కెట్‌లో ఎన్డీటీవీ షేర్ జోరుగా దూసుకెళ్తోంది. ఇవాళ మరో 5 శాతం ఎగబాకింది. ప్రస్తుతం బీఎస్ఈలో కంపెనీ షేర్ విలువ 447.50 రూపాయలకు చేరుకోగా..ఎన్ఎస్ఈలో 446.30 రూపాయలుంది. కేవలం ఐదురోజుల వ్యవధిలో ఎన్డీటీవీ షేర్ విలువ 24.74 శాతం వృద్ధి చెందింది.
Also read: Road Accident: ఆరు ప్రాణాలను మింగిన పొగమంచు.. రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook