KFC in Ayodhya: బాలరాముని విగ్రహం అయోధ్యలో ప్రతిష్ఠించినప్పటి నుంచి దేశం నలుమూలల నుంచి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఈనేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు కూడా వెలుస్తున్నాయి. అయితే, విదేశీ వ్యాపార సంస్థ అయిన కేఎఫ్‌సీ కూడా తమ వ్యాపారాన్ని అయోధ్యలో ప్రారంభించానుకుంటోంది. అయితే దీనికి ఓ ముఖ్యమైన షరతు విధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్షల్లో బాలరాముని దర్శనకు వస్తున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా అయోధ్యలో వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, అమెరికన్ వ్యాపార సంస్థ కేఎఫ్‌సీ కూడా ఇక్కడ తమ శాఖను ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది.


ఇదీ చదవండి: RBI Repo Rate: RBI కీలక నిర్ణయం.. వరుసగా 6వ సారి రెపోరేటు 6.5% యథాతథం..


ఆ ఒక్క షరతు..
అయోధ్య కలెక్టర్ నితీష్ కుమార్ కేఎఫ్‌సీ అవుట్ లెట్ అయోధ్యలో ప్రారంభించేందుకు స్వాగతించారు కానీ, మద్యం, మాంసం నిషేధించిన అయోధ్య పరిసర ప్రాంతాల్లో విక్రయాలు చేయకూడదని అన్నారు. దుకాణాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే ఈ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలన్నారు.


అంటే కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌ను అయోధ్యలో ఏర్పాటు చేసినా మాంసాహారం విక్రయించకూడదు. నిషేధిత ప్రాంతాలు మినహా ఎక్కడైనా విక్రయాలు చేసుకోవచ్చని కలెక్టర్ నితీష్ తెలిపారు.


ఇదీ చదవండి: CBSE Admit Card Out: CBSE హాల్ టిక్కెట్స్ విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి..


కేఎఫ్‌సీతోపాటు మెక్‌డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి ప్రసిద్ధ బ్రాండ్లు కూడా విక్రయాలు చేపట్టనున్నాయి. కానీ, పరిమిత మెనూతో వ్యాపారం చేయాలని సుచించారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి