Kolkata Doctor case: కోల్ కతా డాక్టర్ పై హత్యాచారం.. 19 మంది అరెస్టు.. దేశంలో కొనసాగుతున్న నిరసనలు..
Kolkata Rg kar hospital: కోల్ కతాలో ఆగంతకులు ఆర్ జీ కర్ ఆస్పత్రిలో ప్రవేశించి హల్ చల్ చేశారు. అంతేకాకుండా.. ఆస్పత్రిలోని వార్డులు, ఎమర్జెన్సీ విభాగం గదిలోకి ప్రవేశించి అక్కడి వస్తువులను చిందర వందర చేశారు. ఆస్పత్రిలో ఫర్నీచర్ లన్నింటికి ధ్వంసం చేసి నానా బీభత్సం చేశారు.
Kolkata doctor murder case 19 arrested held for rg kar hospital vandalism: పశ్చిమ బెంగాల్ లో జూనియర్ డాక్టర పై అత్యాచార ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారింది. కోల్ కతాలోని ఆర్ జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ ... తన డ్యూటీలో భాగంలో నైట్ షిఫ్ట్ లో ఉంది. ఆమెను కొంత మంది బలవంతంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన తెల్లవారు జామున జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తొలుత ఈ ఘటనను సూసైడ్ గా భావించారు. కానీ యువతి శరీరంలోపైన ఉన్న రక్తపు మరకలు, మొదలైన వాటిని చూసి అనుమానంతో పోలీసులు కేసు నమోదుచేశారు. పోస్ట్ మార్టంలో దారుణమైన విషయాలు బైటపడ్డాయి. యువతి శరీరంలో 150 ఎంఎల్ లో వీర్యం ఉన్నట్లు గుర్తించారు.
అంతేకాకుండా.. ఆమె గొంతు ఎముక విరిగిపొయింది. ఆమె కళ్లు, నోటిలో నుంచి రక్తం బైటికొచ్చింది. అంతర్గత అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొంత మంది కలిసి అత్యంత పాశావికంగా అత్యాచారం చేసిన హత్య చేసినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్టులో బైటపడింది. ఇదిలా ఉండగా.. దీనిపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతుంది.ఈ క్రమంలో గురువారం అనూహ్యాంగా కొంత మంది ఆందోళనకారులు ఆర్ జీ కర్ ఆస్పత్రిమీద మూకదాడిచేశారు. వందల సంఖ్యలో దూసుకునివచ్చి, ఆస్పత్రిలోని సామాగ్రిని చిందర వందరగా పాడేశారు.
అక్కడ ఫర్నీచర్ నుపూర్తిగా ధ్వంసం చేశారు.ఆస్పత్రిలో అన్నివార్డులలో ప్రవేశించినానా బీభత్సం చేశారు. కొంత మంది కావాలని యువతి హత్యాచారానికి సంబంధించిన ప్రూఫ్ లను తారుమారుచేసేందుకు ఈ మూకదాడులు చేసినట్లు కొంత మంది డాక్టర్టు ఆరోపిస్తున్నారు. దాడిచేసిన వారు విద్యార్థులు కాదని, కేవలం కొన్నిరాజకీయ పార్టీలకు చెందిన గుండాలంటూ కూడా మెడికోలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఏకంగా దేశ ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తూ.. మహిళలపై దాడులు,హత్యాచారాలు జరగటం దారుణమన్నారు.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై తొందరగా విచారణ జరిగిపించి,దోషులకు కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా చెప్పారు. కోల్ కతా ఆర్ జీ కర్ ఆస్పత్రి.. దాడి ఘటనపై పోలీసులు ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరికొందరిని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా 24 గంటల బంద్ ప్రకటించింది.
Read more: Snake: అయ్యో.. తాగిపాడేసిన బీర్ టిన్ లో తలదూర్చిన పాము.. ఆ తర్వాత ఏ జరిగిందంటే..
అనేక వైద్య సంఘాలు మద్దతు..
ఇండియన్ మెడికల్ అసొసియేషన్.. బంద్ ఆగస్టు 17వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచి ఆగస్టు 18వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. దీంతోపాటు దేశంలోని అనేక వైద్య సంఘాలు కూడా ఐఎంఏ బంద్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం దేశాన్ని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి