Kolkata Doctor Rape & Murder Case: ఆగస్టు 9వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఘోర కలి దేశమంతటినీ ఉలిక్కిపడేలా చేసింది. 31 ఏళ్ల వైద్యురాలిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఇది. 9వ తేదీ రాత్రి నుంచి ఇప్పటి వరకూ ఈ కేసులో ఏమేం జరిగింది, ఎలా జరిగిందనే వివరాలు ఓ సారి పరిశీలిద్దాం. ఇందులో కళాశాల నిర్లక్ష్యం, సాక్ష్యాలు చెరపడం, శాంతి భద్రతలు లేకపోవడం ఒకటేమిటి అన్నీ అనుమానాలకు తావచ్చే ఘటనలే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 31 ఏళ్ల వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన వెనుక అన్నీ అనుమానాలే. నిందితుడిగా సంజయ్ రాయ్ అరెస్ట్ అవడం, కేసు దర్యాప్తు సీబీఐకు అప్పగించడం, సుప్రీంకోర్టులో విచారణ ఇలా చాలా పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. 


ఎప్పుడు ఏం జరిగింది


ఆగస్టు 9వ తేదీ రాత్రి రెండో ఏడాది పీజీ చేస్తున్న 31 ఏళ్ల వైద్యురాలు ఆర్‌జి కర్ ఆసుపత్రిలో జూనియర్లతో కలిసి రాత్రి భోజనం చేసింది. ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకునే ప్రదేశం లేకపోవడంతో సెమినార్ హాల్‌లో రెస్ట్ తీసుకోవాలనుకుంది. మరుసటి రోజు ఉదయం అదే సెమినార్ హాలులో ఆమె సెమీ న్యూడ్ స్థితిలో మరణించి, ఒళ్లంతా రక్త గాయాలతో కన్పించింది.


అత్యాచారం ఆపై హత్య జరిగినట్టుగా తెలిసింది. బాధితురాలి తండ్రి తన ఆందోళన వ్యక్తం చేశాడు. దర్యాప్తు ఆలస్యం కావడం వెనుక ఆసుపత్రి యాజమాన్యాన్ని బాధ్యున్ని చేశాడు. రెండు కాళ్లు విడిపోయి అత్యంత దారుణమైన స్థితిలో 31 ఏళ్ల  వైద్యురాలు కన్పించింది. కుమార్తె దేహాన్ని చూసేందుకు తల్లిదండ్రులు 3-4 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. 


అంతకంటే ముందు ఆసుపత్రి అసిస్టెంట్ సూపరింటెండెంట్ నుంచి బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ ద్వారా తండ్రికి సమాచారం అందింది. అనంతరం  ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్ధినుల నిరనసలు పెరగడంతో అతనిని బాధ్యతల్నించి తప్పించారు. అయితే ఆశ్చర్యమేంటంటే ఆర్‌జి కర్ ఆసుపత్రి నుంచి తొలగించిన 24 గంటల్లో కోల్‌కతా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించడం. 


అత్యవసర విధులు తప్పించి మిగిలిన అన్ని సేవలను జూనియర్ డాక్టర్లు నిలిపివేశారు. తక్షణం నిందితుల్ని అరెస్టు చేయాలనే డిమాండ్ పెరిగింది. క్రమంలో నిరసనలు దేశమంతా వ్యాపించాయి. 


అదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్‌గా పరిచయమైన 33 ఏళ్ల సంజయ్ రాయ్‌ను ఈ ఘటనలో నిందితుడిగా ఆరెస్టు చేశారు. అతనికి వ్యతిరేకంగా ఘటనా స్థలంలో ఆధారాలు లభ్యమయ్యాయి. సంజయ్ రాయ్ నేపధ్యం కూడా పోర్నోగ్రఫీ వీడియోలు చూడటం, నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యల్ని హింసించడం ఇతర నేరారోపణలు ఉన్నాయి. 


బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అవసరమైతే నిందితుడిని ఉరి తీసేందుకు వెనుకాడమని చెప్పారు. 


ఈ ఘటనలో ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేశారని కేంద్ర సమాచార శాఖకు చెందిన సీనియర్ సలహాదారుడు కాంచన్ గుప్తా ఆరోపించారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసులు పురోగతి సాధించకపోవడంతో కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకు అప్పగించింది.


ఆగస్టు 14వ తేదీ రాత్రి శాంతియుతంగా చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆర్‌జి కర్ ఆసుపత్రిని ధ్వంసం చేసింది. పోలీసులకు, ప్రదర్శనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. 


కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకు ఆలస్యం జరిగిందని కోర్టు ప్రశ్నించింది. సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ నివేదికలో సంచలన విషయాలు ప్రస్తావించింది. గ్యాంగ్ రేప్ జరిగి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. 


Also read: Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచార ఘటనపై సీబీఐ సంచలనం, గ్యాంగ్ రేప్ కాకపోవచ్చు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook