Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు వేగంగా విచారణ జరుపుతోంది. అటు పశ్చిమ బెంగాల్ పోలీసులు, ఇటు సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సుప్రీంకోర్టుకు సమర్పించాయి. ఆర్జీ కర్ ఆసుపత్రి విధ్వంసం నివేదికను వెస్ట్ బెంగాల్ పోలీసులు సమర్పించారు. ఈ కేసు విచారణలో సీబీఐ స్టేటస్ రిపోర్ట్ సంచలనం కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు  విధుల్లో చేరారని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆసుపత్రి యాజమాన్యాలకు అదేశాలు జారీ చేసింది. కోల్‌కతా హత్యాచార ఘటనను సమోటోగా స్వీకరించిన విచారణ జరుపుతున్న ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన చేస్తున్న వైద్యులంతా విధులకు హాజరు కావాలని కోరుతున్నారు. వైద్యుల భద్రతపై వివిధ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతియుత నిరసనలకు విఘాతం కల్గించవద్దని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తెలిపింది. 


అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలు వైద్య సంస్థల వదగ్ద ఏ విధమైన హింస, భయాందోళన లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. 


మరోవైపు ఈ కేసులో సీబీఐ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. అసలు ఆ వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగి ఉండకపోవచ్చని సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుడైన సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలు సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ ఘటనలో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ స్పష్టం చేసింది. 


Also read: Aadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చుకోవచ్చో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook