కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం
కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం
కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాగ్రీ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఐదంతస్థుల భవనంలో మంటలు చెలరేగగా.. 30 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్నిప్రమాద ఘటన ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
కోల్‌కతాలో మేయర్ శోవన్ చటర్జీ ప్రకారం.. ఆదివారం ఉదయం 2.45 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 30 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఇప్పటి వరకు ఎవరూ గాయపడలేదు. మంటలు బేస్‌మెంట్ నుండి ప్రారంభమై క్రమక్రమంగా పైకి వ్యాపించాయి.
మరోవైపు ఢిల్లీలో కూడా ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని ఉద్యోగ్ నగర్ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అధికారులు 30 ఫైరింజన్లను అక్కడికి పంపించారు. ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు.