Kolkata Gay Couple Abhishek Ray and Chaitanya Sharma tied the knot: ప్రేమకు వయసు, రంగు, డబ్బు, రూపు, కులం, మతం అనే తేడా ఉండదు. ప్రేమ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరి మధ్య చిగురిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు అమ్మాయి, అబ్బాయి ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఒక్కటయ్యేవారు. ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. లింగబేధం అనే తేడా ప్రేమలో పెడుతున్నారు. అమ్మాయితో మరో అమ్మాయే ప్రేమలో పడడం.. అబ్బాయిని మరో అబ్బాయి ప్రేమించడం ఇటీవల ఎక్కువగా చూస్తున్నాము. మహిళా క్రికెటర్లు చాలా మందే ఇప్పటికే అధికారికంగా పెళ్లిచేసుకోగా.. ఇటీవల ఓ అమ్మాయి తనను తానే వివాహం ఆడింది. తాజాగా ఇద్దరు మగాళ్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది హైదరాబాద్‌ నగరంలో ఇద్దరు అబ్బాయిలు (స్వలింగ సంపర్కులు) ఒకటైన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతా, గుర్గావ్‌లకు చెందిన మరో గే జంట కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ మధ్య ఏర్పడిన ఈ ప్రేమ సంబంధాన్ని చిరకాలం కొనసాగించాలని.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఇందుకోసం ఇంట్లో వాళ్లను కష్టపడి ఒప్పించారు. వాళ్లు అంగీకరించడంతో సంప్రదాయబద్ధంగా జూన్ 3న వివాహం చేసుకున్నారు.


అభిషేక్ రే, చైతన్య శర్మ పెళ్లి వేడుక సాధారణ పెళ్లిళ్లు మాదిరే జరిగింది. మంగళ స్నానాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. పూజారి వేద మంత్రాల సాక్షిగా.. అభిషేక్ రే, చైతన్య శర్మ ఏడడుగులు వేశారు. పవిత్ర అగ్ని చుట్టూ తిరిగి ఏడడుగులు కూడా వేశారు. జీవితాంతం ఒకరినొకరు తోడుంటామని ప్రమాణం చేశారు. కుటుంబం, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా బెంగాలీ, మార్వాడీ ఆచారాల ప్రకారం వీరి వివాహం జరిగింది. 



పెళ్లిలో అభిషేక్ రే ధోతీ, కుర్తా ధరించగా.. చైతన్య శర్మ షేర్వాణీ వేసుకున్నారు. శనివారం పెళ్లి జరగ్గా.. ఆదివారం కోల్‌కతాలో విందు కూడా ఏర్పాటు చేశారు. వీరి పెళ్లి, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను వెడ్డింగ్ ప్లానర్ కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశాడు. అందరూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిషేక్ ఫ్యాషన్ డిజైనర్ కాగా.. చైతన్య జిటల్ మార్కెటింగ్ నిపుణుడు. 




Also Read: Lion Video: మహిళ ముందు సింహం కూడా పిల్లి అవుతుంది.. ఇదిగో ప్రూఫ్! వీడియో చూస్తే షాక్


Also Read: IND Vs ENG 5th Test: దంచికొట్టిన బెయిర్‌స్టో, రూట్.. ఇంగ్లండ్ ఘన విజయం! భారత్ ఆశలు ఆవిరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook