Kolkata murder case west Bengal cm mamata Banerjee writes letter to pm modi: దేశంలో కోల్ కతా ఘటన కుదిపేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికి ఈ ఘటనపై కోల్ కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా  ఈ ఘటను సుమోటోగా స్వీకరించి మరీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9 న జూనియర్ డాక్టర్ హత్యచారం జరిగిన తర్వాత పోలీసులు, కోల్ కతా ప్రభుత్వం, మరోవైపు ఆర్ జీ కర్ ఆస్పత్రి వర్గాలు ప్రవర్తిరంచిన తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టులో జూనియర్ డాక్టర్ హత్యపై వాడివేడీగా వాదనలు జరిగాయి. ఇదిలా ఉండగా.. కోల్ కతా సీఎం మమతా బెనర్జీ మరోసారి వార్తలలో నిలిచాయి. కోల్ కతా ఘటనతో దేశం అట్టుడుకుతున్న వేళ.. దీదీ మోదీకి లేఖను రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మమతా రాసిన లేఖను.. ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ విలేకరుల సమావేశంలో బెనర్జీ లేఖను చదివి విన్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాలు..


కోల్ కతా  ఘటనతో దేశం ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మమతా బెనర్జీ మోదీకి రాసిన లేఖాంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో మహిళలు, అమ్మాయిల మనుగడ పెనుసవాల్ గా మారిందని మమతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 90 వరకు అత్యాచార ఘటనలు జరుగున్నాయన్నారు. మహిళలపై అత్యాచారం, హత్యలు చేసేవారికి కఠినమైన శిక్షలు విధించాలని దీదీ డిమాండ్ చేశారు. ఎక్కడైన ఘటన జరగ్గానే.. 15 రోజుల్లోగా పూర్తి విచారణ జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేలా చట్టం తీసుకొనిరావాలన్నారు. అదే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో వేగంగా కేసులను విచారించి నిందితులకు కఠినంగా  శిక్షలు అమలు చేయాలని ప్రధానిని దీదీ అభ్యర్థించారు. 


దేశంలో జరుగున్న మహిళలు, అమ్మాయిలపై అత్యాచారం, హత్యలు తీవ్ర ఆందోళన రెకెత్తిస్తున్నాయన్నారు. ఇంటి నుంచి బైటకు వెళ్లిన మహిళలు మరల ఇంటికి వచ్చే వరకు కూడా, ఆందోళనగా ఉందన్నారు. ఇలాంటి అరాచకాలకు చరమగీతం పాడేలా చర్యలు తీసుకొవాలన్నారు.  అదే విధంగా బాధితులు ధైర్యంగా, అన్ని విధాలుగా అండగా ఉండేలా కేంద్ర ప్రత్యేక చట్టాలు తీసుకొని రావాలని మమతా తన లేఖలో పేర్కొన్నారు. 


ఇదిలా ఉండగా.. ఆగస్టు 9 న వెలుగులోకి వచ్చిన జూనియర్ డాక్టర్ హత్యచార ఘటన ప్రస్తుతందేశాన్నికుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఘటనపై తీవ్ర అసహానం వ్యక్తం చేసింది. గత 30 ఏళ్ల సర్వీసులో ఏ రోజు కూడా ఇంత దారుణమైన కేసును చూడలేదంటూ కూడా ధర్మాసం ఆందోళన వ్యక్తం చేసింది.


Read more: Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంఎల్ ల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..


బాధిత యువతి.. సెమినార్ గదిలో దారుణమైన స్థితిలో ఉండటంపై భిన్నమైన వ్యాఖ్యలను చేయడం పట్ల కూడా సుప్రీం.. కోల్ కతా పోలీసులు, ప్రభుత్వంపై మండిపడింది. యువతి డెడ్ బాడీ దహాన సంస్కారాల తర్వాత ఎఫైఐఆర్ నమోదుచేయడం, 18 గంటల తర్వాత క్రైమ్ సీన్ ను సీల్ చేయడం, సెమినార్ గదిలో అప్పటికప్పుడు.. మరమ్మత్తులు చేపట్టడం వంటివి.. ఘటనను తప్పుదోవ పట్టించడం కాదా.. అంటూ సుప్రీంకోర్టు మండిపడింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter