Kullu Bus Accident: లోయలో పడ్డ బస్సు... స్కూల్ పిల్లలతో సహా 16మంది దుర్మరణం!
Kullu Bus Accident: హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు.
Kullu Bus Accident: హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులు, ప్యాసింజర్స్ తో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో (Kullu Bus Accident) 16 మంది ప్రాణాలు కోల్పోగా... మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నారని అధికారులు వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) కులు జిల్లాలోని సైంజ్‌కు వెళ్తున్న బస్సు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో జంగ్లా గ్రామ సమీపంలోని లోయలో పడిపోయిందని కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్ తెలిపారు. కులు జిల్లా అధికారులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని...మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బస్సులో కనీసం 40 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం జైరామ్ ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. "హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను'' అంటూ మోదీ (PM Modi) ట్వీట్ చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గాయపడినవారికి రూ.50వేల ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
Also Read: Fouth wave alert: దేశంలో స్థిరంగా కరోనా వ్యాప్తి.. మెుత్తం కేసుల ఎన్నంటే?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోం
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook