కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి రికార్డు సృష్టించారు. కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కుమార‌స్వామి 40 ప్రముఖ ఆలయాలు సందర్శించారు. 82 రోజుల్లో ఏకంగా 40 ఆలయాలకు వెళ్లి ఈ ఘనత సాధించారు. రోజు విడిచి రోజు ఆలయాలను సందర్శించి ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ రికార్డును సాధించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ప్రకారం.. కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి (మే23) నుంచి ఆదివారం (ఆగస్టు 12) నాటికి 34 ఆలయాలను దర్శించారు. సోమవారం హరదనహళ్లి ప్రాంతంలోని ఈశ్వరుని ఆలయంతో పాటు హస్సన్ జిల్లాలోని మరో ఐదు ఆలయాలకు వెళ్లారు. దీంతో పాటు కుమారస్వామి కనీసం ఆరు ప్రసిద్ధ మఠాలకు వెళ్లారు. వాటిలో తుముకూరులోని సిద్ధగంగా, మాండ్యాలోని అడిచుంచనగిరి మఠాలు ఉన్నాయి. మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఇలా ఆలయాలకు సందర్శించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆలయాల సందర్శనలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రికార్డ్‌ను కూడా కుమారస్వామి బ్రేక్ చేశారని వినికిడి.


సోమవారం ఓ ఫంక్షన్‌కు వెళ్లిన కుమారస్వామి.. కుటుంబంతో కలిసి ధర్మస్థల మంజునాథ స్వామికి సర్వ సేవే పూజను నిర్వహించారు. కర్ణాటకలో వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నందుకు సీఎం ఈ పూజ చేశారని ఆలయ పండితులు చెబుతున్నారు.


[[{"fid":"172868","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కుమారస్వామి కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ జేడీఎస్ నేత మాట్లాడుతూ, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ కుటుంబానికి మతపరమైన ఆచారాలు, జ్యోతిష్యంపై నమ్మకముందని.. అయితే కుమారస్వామి ఇందుకు మినహాయింపుగా ఉండేవారని.. అయితే చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో దేవుడిపై నమ్మకం పెరిగిందన్నారు.