Lalu prasad yadav: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతంగా క్షీణించింది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితిని రిమ్స్ వైద్యులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పశువుల దాణా కుంభకోణం( Fodder scam ) కేసులో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ( Bihar ex cm lalu prasad yadav ) ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రి ( Rims hospital )లో చికిత్స అందిస్తున్నారు. రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని..రిమ్స్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు. లాలూ ప్రసాద్ కిడ్నీలు ఇప్పుడు కేవలం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని..ఎప్పుడైనా పూర్తిగా క్షీణించవచ్చని వైద్యులు చెప్పారు. ఎప్పుడనేది ఊహించడం కష్టమని..ఎప్పుడైనా కావచ్చని అన్నారు. ఇది నిజంగానే ఆందోళన కల్గించే పరిణామమని వైద్యులు స్పష్టం చేశారు.


లాలూ ఆరోగ్యం, ఆయన కిడ్నీల పరిస్థితి గురించి అధికారులకు లిఖితపూర్వకంగా సమచారం అందించామని డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే లాలూకు డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నారు. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటీషన్ పై విచారణను జార్ఘండ్ హైకోర్టు ( Jarkhand high court ) జనవరి 22కు వాయిదా వేసింది. Also read: Positive Pay: జనవరి 1 నుంచి మారనున్న చెక్ బుక్ రూల్స్, కొత్త బ్యాంకింగ్ రూల్స్ తెలుసుకోండి!