దాణా కుంభకోణంలో లాలూ దోషి
రాంచీ ప్రత్యేక సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా గుర్తించింది.
రాంచీ ప్రత్యేక సీబీఐ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ ను దాణా కుంభకోణం కేసులో దోషిగా గుర్తించింది.ఈ కేసులో కోర్టు మొత్తం 15 మందిని దోషులుగా తేల్చింది. అందులో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో సహా ఏడుగురిని న్యాయస్థానము నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. తీర్పు వెలువడిన నేపథ్యంలో కోర్టు బయట పెద్దసంఖ్యలో గుమిగూడిన ఆర్జేడీ కార్యకర్తలు లాలూకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. ఈ కేసులో లాలూను దోషిగా నిర్ధారించిన కోర్టు జనవరి 3, 2018 శిక్ష ఖరారు చేయనుంది. ఆయన్ను పోలీసులు రాంచీ జైలుకు తరలిస్తున్నారు.