గుడ్ న్యూస్.. యూజీసీ నెట్2020 దరఖాస్తుల గడువు పెంపు
ఆఖరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు ఆఖరు తేదీని (UGC NET 2020 Online Application Date Extended) మే 16వరకు పొడిగించారు.
న్యూఢిల్లీ: యూజీసీ నెట్ 2020 (UGC NET-2020) ఏడాదికిగానూ దరఖాస్తులు నెల నుంచి స్వీకరిస్తున్నారు. . కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారు యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఖరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీని ఏప్రిల్ 16 నుంచి మే 16వరకు పొడిగించారు.పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం UGC NET-2020 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మార్చి నెల రెండో వారంలో విడుదల చేసింది. తొలుత నిర్ణయించినట్లుగా అయితే మార్చి 16 నుంచి ఏప్రిల్ 16వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలోో దరఖాస్తు చివరితేదీని నెల రోజులపాటు పొడిగించారు. మే16వరకు నెట్2020కు దరఖాస్తు చేసుకోవచ్చు. లాక్‌డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే
ప్రస్తుతం దేశంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి, ఈ వైరస్ సమస్య బారి నుంచి బయటపడితే నిర్ణీత షెడ్యూలు ప్రకారమే హాట్ టికెట్లు జారీ, పరీక్ష నిర్వహణ అనంతరం ఫలితాల విడుదల ఉంటుంది. లేని పక్షంలో షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది.
యూజీసీ నెట్ వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి
దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.03.2020.
దరఖాస్తుకు చివరితేది: 16.05.2020
ఫీజు చివరితేది: 17.05.2020
పరీక్ష తేదీలను వెల్లడించాల్సి ఉంది. ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు
Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos