న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (Income Tax) చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆదాయపన్ను చెల్లింపు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 30కి ఐటీ రిటర్న్స్ గడువును పెంచినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మంత్రి నిర్మల మంగళవారం మీడియాతో మాట్లాడారు. 2018-19  ఏడాదికిగానూ ఆదాయపన్ను చెల్లించని వారు జూన్ చివరికల్లా ఐటీ రిటర్న్స్ కట్టేయాలని సూచించారు. ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో శుభవార్త కూడా అందించారు. ఆలస్యమైన పన్ను చెల్లింపులపై ఉన్న వడ్డీ రేటును తగ్గించారు. ఇదివరకు 12శాతంగా ఉన్న ఆలస్య ఆదాయపన్ను వడ్డీ రేటును 9కి తగ్గించినట్లు ప్రకటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో ఆర్థిక మాంధ్యం అన్ని రంగాలపై ప్రభావం చూపడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి


వీటితో పాటు  టీడీఎస్ జమలో ఆలస్య చెల్లింపు రుసుమును ఏకంగా 18 నుంచి 9 శాతానికి తగ్గించారు. పాన్, ఆధార్ అనుసంధానం గడువును కూడా జూన్ 30వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటుగా  ఏప్రిల్, మే నెలల జీఎస్టీ రిటర్న్ గడువును సైతం జూన్ 30 వరకు పొడిగించినట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


మనసున్న మారాజు.. ప్రకాష్ రాజ్


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ