Lata Mangeshkar: ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి కల్గించే వార్త. ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న లతా మంగేష్కర్ కొద్ది క్షణాల క్రితం తుది శ్వాస విడిచారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాటలతో, మంత్రముగ్దమైన, శ్రావ్యమైన కంఠంతో అందర్నీ అలరించిన ది గ్రేట్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. కరోనా సోకడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఐసీయూలోనే ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గత రెండ్రోజుల్నించి ఆమె ఆరోగ్యం విషమిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. కొద్ది  క్షణాల క్రితం ఆమె తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ కరోనా నుంచి కోలుకున్న తరువాత ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి ఊపిరితిత్తుల సమస్య ఆమెకు చాలా కాలంగా ఉంది. నిన్నటి నుంచి పరిస్థితి ఒక్కసారిగా విషమిస్తూ వచ్చింది. ఇవాళ కొద్దిసేపటి క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. జనవరి 8వ తేదీన ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారించారు.


దేశం గర్వించే సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar). సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాణిగా వెలిగిన లతా మంగేష్కర్‌కు భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవం లభించింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ స్వరకోకిలగా ఆమెను మాత్రమే పిలుస్తారంటే ఆమె ఖ్యాతి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. దేశంలోని పలు భాషల్లో ఆమె పాటలు మంత్రముగ్దుల్ని చేస్తుంటాయి. 1929 సెప్టెంబర్ 28న ఇండోర్ లో జన్మించిన లతా మంగేష్కర్..13 ఏళ్ల ప్రాయంలోనే సింగర్ గా కెరీర్ ప్రారంభించారు. దేశంలోని పలు భాషల్లో ఇప్పటి వరకూ 25 వేలకు పైగా పాటలు పాడారు.కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే మూడు జాతీయ అవార్డులు దక్కించున్నారు లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ సహా మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు. ఆశా భోంస్లే, హృదయనాధ్ మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్.


లతా పాడిన పాటల్లో దేశభక్తిని రగిలిస్తూ..కంటనీరు తెప్పించే పాట ఇప్పటికీ ఒక్కటే. అదే అయ్ మేరె వతన్ కే లోగో...ఎన్నిసార్లు విన్నా..కంటనీరు వచ్చి తీరుతుంది. పాటలో సాహిత్యానికి తోడు లతా ఆ పాటను పాడిన విధానం అటువంటిది. హృదయాల్ని హత్తుకుంటుంది. కంటనీరు తెప్పిస్తుంది. ఇక మరో పాట లగ్ జా గలే సే ఫిర్..ఎక్కడికో తీసుకెళ్లిపోతుంటుంది.


Also read: Indias Top 5 Beaches: దేశంలోని ఐదు అందమైన బీచ్‌లు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook