Lesbian Marriage in Haryana: రాజస్తాన్‌కు చెందిన 18 ఏళ్ల యువతి, హర్యానాకు చెందిన 23 ఏళ్ల మరో యువతి పెళ్లితో ఒక్కటయ్యారు. వరసకు బంధువులైన ఈ ఇద్దరూ ఏడాది కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియడంతో ఇద్దరినీ మందలించినప్పటికీ వీరి ప్రేమాయణానికి బ్రేక్ పడలేదు. పైగా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసే జీవనం సాగిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... రాజస్తాన్‌లోని రతన్‌గఢ్‌లో 18 ఏళ్ల యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గతేడాది తన వదిన సోదరి (22) రతన్‌గఢ్‌లోని వారి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇద్దరు యువతుల మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లకు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో ఈ ఇద్దరూ మళ్లీ కలుసుకోకుండా కట్టడి చేశారు.


ఇదే క్రమంలో గతేడాది నవంబర్ 14న రతన్‌గఢ్ యువతి ఇంటి నుంచి పారిపోయింది. హర్యానాలోని అదంపూర్ మండీకి చెందిన తన ప్రేయసిని ఫతేబాద్‌లో కలుసుకుంది. ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి జింద్ ప్రాంతంలో ఇద్దరు కలిసి జీవనం సాగిస్తున్నారు. మరోవైపు, రతన్‌గడ్ యువతి మిస్సింగ్‌పై ఆమె తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా... ఎట్టకేలకు జింద్‌లో ఆమె ఆచూకీని గుర్తించారు.


కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని పోలీసులు జింద్‌కు వెళ్లగా... ఆ యువతి వారితో వెళ్లనని తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఇద్దరు యువతుల లెస్బియన్ మ్యారేజ్ (Lesbian Marriage) స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఇటీవలే మహారాష్ట్రలోని నాగపూర్‌కి చెందిన ఇద్దరు మహిళా వైద్యులు సైతం లెస్బియన్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఆ లెస్బియన్ జంట త్వరలో గోవాలో పెళ్లితో ఒక్కటి కానున్నారు.


Also Read: Afghan Crisis: ఆఫ్గన్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు.. కిడ్నీలు అమ్ముకుంటున్న పేదలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి