Rain Alert: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. రుతు పవనాలకు ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. నిన్న బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ జార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు కింది స్థాయి గాలులు పశ్చిమ నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. దీంతో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. రేపు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. 


రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ లెటెస్ట్ వెదర్ రిపోర్ట్‌ను ప్రకటించింది. ఇటు ఏపీలోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఏకధాటిగా వానలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.


Also read:Hyd Metro: కాసేపట్లో ప్రధాని మోదీ బహిరంగ సభ..ఆ స్టేషన్లలో మెట్రో ఆగదు..!


Also read:BJP Vijaya Sankalpa Sabha Live Updates: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం.. సమావేశ హాల్లోకి తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook