Delhi Assembly dissolves: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్
Delhi Election Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న రోజే లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు కొనసాగుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 57 స్థానాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ 13 సీట్లలో మెజార్టీలో ఉంది. ఇంకా తొలి ఫలితం వెలువడలేదు. అయితే ఢిల్లీలో వరుసగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 11 జిల్లాలకుగానూ 7 జిల్లాల్లో ఆప్ సంపూర్ణ విజయం సాధించే దిశగా ఫలితాలు రానున్నాయి.
ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి
ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా మంగళవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీ శాసనసభను రద్దు చేశారు. అసెంబ్లీ రద్దు చేయడంపై ప్రకటన చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయానంతరం కేజ్రీవాల్ ఫిబ్రవరి 14, 2015న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. ఈ అసెంబ్లీ గడువు ఈనెల 13తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంగ్ గవర్నర్ అనిల్ జైజాల్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీ ఆరో శాసనసభ రద్దయింది.
Also Read: ఢిల్లీ ఆప్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు
కాగా, అరవింద్ కేజ్రీవాల్ జోస్యం నిజమైంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఆప్ మూడోసారి అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఆప్ కీలక నేతలు ఓట్ల లెక్కింపులో తమ ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాత్రం బీజేపీ అభ్యర్థి రవి నేగిపై వెనుకంజలో ఉండటం గమనార్హం. గత ఐదేళ్ల తమ పాలనకే ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఆప్ నేతలు చెబుతున్నారు.