LIC Pension Scheme: ఎల్ఐసీ అనేది ప్రభుత్వ రంగ బీమా సంస్థ. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పధకాలు అందిస్తుంటుంది. అదే విధంగా పెన్షన్ ప్లాన్స్ కూడా అందిస్తోంది. మీరు కూడా రిటైర్మెంట్ తరువాత మంచి పెన్షన్ ప్లాన్ కోసం చూస్తుంటే ఎల్ఐసీ మంచి ఆప్షన్ కాగలదు. ఎల్ఐసీలో ఇన్వెస్ట్‌మెంట్ అంటే రిస్క్ ఏ మాత్రం ఉండదు. రిటర్న్స్ బాగుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ ఇందుకు అనువైంది. రిటైర్మెంట్ తరువాత నెల నెలా క్రమం తప్పకుండా పెన్షన్ అందించే స్కీమ్ ఇది. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. నెల నెలా పెన్షన్ లభిస్తుంది. ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ అనేది చాలా ప్రాచుర్యం పొందిన రిటైర్మెంట్ ప్లాన్. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు 12 వేలు పెన్షన్ పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. పీఎఫ్ ఫండ్, గ్రాట్యుటీలో రిటైర్మెంట్‌కు ముందు ఇన్వెస్ట్ చేస్తే  జీవితాంతం నెలనెలా పెన్షన్ తీసుకోవచ్చు. 


40 ఏళ్ల కంటే తక్కువ వయస్సుంటే ఈ పధకానికి అనర్హుడు. ఈ పథకంలో గరిష్టంగా 80 ఏళ్ల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రతి నెలా 1000 రూపాయల యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా ప్రతి మూడు నెలలకు 3 వేలు, ఆరు నెలలకు 6 వేలు ఏడాదికి 12 వేలు కూడా జమ చేయవచ్చు. సరల్ పెన్షన్ పధకంలో ఏడాదికి కనీసం 12 వేల యూన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా తీసుకోవచ్చు. 42 ఏళ్ల వ్యక్తి 30 లక్షల యూన్యుటీ ప్లాన్ తీసుకుంటే నెలకు 12,388 రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చు. 


ఎల్ఐసీ సరల్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది నెలకోసారి, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి ఎలాగైనా చేయవచ్చు. ఆరు నెలల తరువాత ఎప్పుడైనా ఈ పాలసీ నిలిపివేయాలంటే నిలిపివేయవచ్చు. ఈ స్కీమ్ కింద లోన్ కూడా పొందవచ్చు. 


Also read: 8th Pay Commission Date: 8వ వేతన సంఘంపై క్లారిటీ వచ్చేసింది, అదిరిపోయేలా పెరగనున్న జీతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.