ఆధార్ తో సిమ్ అనుసంధానం ఇక ఈజీ కానుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి మొబైల్ నెంబర్ తో ఆధార్ అనుసంధానం చేసుకునే  విధంగా వెసులుబాటు కలిపిస్తున్నట్లు యుఐడిఏఐ పేర్కొనింది. ఓటీపీ ఆధారిత సిమ్ కార్డు వెరిఫికేషన్ కు అనుమతి ఇస్తున్నట్లు  యుఐడిఏఐ సీఈఓ అజయ్ భూషణ్ పాండే  చెప్పారు. టెక్కోలకు కస్టమర్లు సమర్పించిన బ్లూ ప్రింట్లకు అనుమతి ఇచ్చామని, డిసెంబర్ 1వ తేదీ నుంచి ఓటీపీ ద్వారా సిమ్ కార్డు వెరిఫికేషన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.  తాజా విధానంతో మొబైల్ యూజర్లు ఇంటివద్ద నుంచే యాప్, ఓటీపీ, ఐవిఆర్ఎస్ ద్వారా ఆధార్ లింక్ చేసుకోవచ్చు.