ముంబై : లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలకు ఇటీవల కేంద్రం పలు షరతులతో కూడిన సడలింపు ఇవ్వడంతో మళ్లీ తెరుచుకున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌, హర్యాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు జోరందుకున్నాయి. నేటి నుంచి తెలంగాణలోనూ మద్యం దుకాణాలు తెరిచేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. మద్యం దుకాణాలు తెరుచుకున్న ప్రాంతాల్లో మందుబాబులు సైతం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాల వద్ద సోషల్ డిస్టన్సింగ్ లక్ష్యం దెబ్బతినెలా మందు బాబులు సినిమా థియేటర్లో క్యూలైన్ల తరహాలో ఒకరిపై మరొకరు నిలబడటం ఆందోళన కలిగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : మద్యం విక్రయాలు.. మందు బాబులకు కండిషన్స్ 


మహారాష్ట్రలోనూ ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ముంబైలో మద్యం దుకాణాల ఎదుట మందు బాబులు సోషల్ డిస్టన్సింగ్ పాటించకుండా ఒకరిని ఆనుకుని మరొకరు నిలబడటం చూసిన బృహత్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. మద్యం దుకాణాలను మూసేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ.. మద్యం దుకాణాల యజమానులు, మందుబాబులు నిబంధనలు పాటించకపోవడాన్ని తప్పుపడుతూ కరోనావైరస్ నివారణ చర్యల్లో భాగంగా మద్యం షాపులు మూసేయాల్సిందిగా బీఎంసి కమిషనర్ ప్రవీణ్ పరదేశి మద్యం దుకాణాల యజమానులను ఆదేశించారు. 


Also read : మందుబాబులకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్


బీఎంసి కమిషనర్ ప్రవీణ్ పర్దేశి ఆదేశాల ప్రకారం నిత్యావసరాల సరుకులు, మెడిసిన్ విక్రయించే దుకాణాలకు మాత్రమే తెరిచే అనుమతి ఉంటుంది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై ఐపిసి సెక్షన్ 188 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని బీఎంసి స్పష్టంచేసింది. దీంతో బుధవారం నుంచి ముంబైలో మరోసారి మద్యం దుకాణాలు మూతపడినట్టు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..