Assembly Elections Results 2024 Live: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్.. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి హవా

Tue, 08 Oct 2024-12:50 pm,

Jammu Kashmir and Haryana Elections Results 2024 Live: జమ్మూ కశ్మీర్‌ను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందా..? హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందా..? ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు రెండు రాష్ట్రాల్లోనూ కమలానికి ఎదురుదెబ్బ తగలనుందా..? హర్యానా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

Jammu Kashmir Haryana Assembly Elections Results 2024 Live: హర్యానా, జమ్మూ కశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. హర్యానాలోని మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించగా.. 68 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 93 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 90 స్థానాలకు 63.88 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 28 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. హర్యానాలో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్నేయగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.  ఆమ్ ఆద్మీ పార్టీ, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక జమ్మూ కశ్మీర్‌లో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. బీజేపీ, పీడీపీ సొంతంగా పోటీ చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన నేపథ్యంలో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

Latest Updates

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ తన ఓటమిని అంగీకరించారు. దక్షిణ కాశ్మీర్‌లోని బిజ్‌బెహరా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 28, పీడీపీ 2, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: హర్యానాలో మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్ అసెంబ్లీ స్థానం నుంచి వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ నేత బ్రిజేందర్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు.
     

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: అన్నిఎగ్జిట్ పోల్స్ సర్వేలు హర్యానా రాష్ట్రంలో  బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదని జోస్యం చెప్పాయి. కానీ అనూహ్యంగా ఎన్నికల ఫలితాలు చూస్తే హర్యానాలో బీజేపీ తన పట్టు నిలబెట్టుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: జులానా స్థానం నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకంజలో ఉన్నారు.

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: హర్యానాలో మూడో రౌండ్‌ నుంచి ఫలితాలు తలకిందులు అవుతున్నాయి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. కాంగ్రెస్ ఆధిక్యం తగ్గిపోయి.. బీజేపీ దూసుకువచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ 39, బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: హర్యానాలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. 67 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉంది. జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి 49 స్థానాలతో మెజారిటీ మార్కును అధిగమించింది. బీజేపీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభంజన కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్, ఎన్‌సీ కూటమి 40కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 28, పీడీపీ 5, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హర్యానాలో కాంగ్రెస్ 57 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుంది. బీజేపీ 22, ఐఎన్ఎల్‌డీ 2, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: హర్యానాలో కాంగ్రెస్ 26 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: హర్యానాలో తొలి ట్రెండ్ ప్రకారం.. బీజేపీ 9 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి 2 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: హర్యానాలో తొలి ట్రెండ్ ప్రకారం.. బీజేపీ 9 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి 2 స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: భారీ ఉత్కంఠ నడుమ హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మొదలైంది.

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: హర్యానా, జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 180 నియోజకవర్గాల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది.

  • Jammu Kashmir Haryana Assembly Elections Results 2024: హర్యానాలో 90 స్థానాలకు మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 68.31 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి గతంలో కాస్త తక్కువగా 68 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 64.8 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link