Live Updates: 4 ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు

Fri, 01 Jun 2018-12:02 pm,

మూడు రోజుల క్రితం మే 28న  వివిధ రాష్ట్రాల్లో 4 లోకసభ స్థానాలకు, 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం (మే 31, 2018) వెల్లడవుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. ప్రధానంగా అందరి దృష్టి ఉత్తర్ ప్రదేశ్ లోని కైరానా పార్లమెంటు స్థానంపై నిలిచింది. కొన్ని రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలు రాజీనామా చేసిన లోకసభ స్థానాలను విపక్షాలు గెలుచుకున్నాయి. కైరానాలో మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ. దీంతో ఈ నియోజకవర్గం ఆసక్తి కరంగా కలిగిస్తోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 



 



 


యూపీలోని కైరానాతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోండియా స్థానాలతో పాటు నాగాలాండ్‌లోని ఏకైక ఎంపీ స్థానానికి పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. నూపుర్‌(ఉత్తర ప్రదేశ్‌), షాకోట్‌(పంజాబ్‌), జోకిహట్‌(బిహార్‌), గొమియా, సిల్లీ(జార్ఖండ్‌), చెంగన్నూరు(కేరళ), పాలుస్‌ కడేగావ్‌(మహారాష్ట్ర), అంపటి (మేఘాలయ), థరాలి(ఉత్తరాఖండ్‌) మహేస్థల( పశ్చిమబెంగాల్‌), ఆర్ఆర్ నగర్ (కర్ణాటక) అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా పదకొండు రాష్ట్రాలలో ఈ ఉప ఎన్నికలు జరగడంతో అధికార ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ పరిస్థితి నెలకొంది. రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికల సమరంలో జనం నాడికి ఈ ఉప ఎన్నికలను సూచీలుగా భావిస్తున్నారు.


ఎన్నికలు జరిగిన  నాలుగు ఎంపీ సీట్లలో మూడు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. ఇక ఇటీవలే కర్నాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్ సంకీర్ణం కొలువుదీరడం, ప్రతిపక్షాల సంఘటిత శక్తికి సంకేతాలు వెలువడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మొత్తం 14 స్థానాలకు ఉప ఎన్నికలకు విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest Updates

  • మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాల సరళి:

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    4 లోక్‌సభ స్థానాలు

    • కైరానా(ఉత్తర్‌ప్రదేశ్): ఆర్ఎల్డీ (ఆధిక్యం)

    • పాల్ఘర్(మహారాష్ట్ర): బీజేపీ (గెలుపు)

    • భండారా–గోండియా(మహారాష్ట్ర): ఎన్సీపీ (గెలుపు)

    • నాగాలాండ్: బీజేపీ కూటమి ఎన్డీపీపీ (ఆధిక్యం)

  • మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాల సరళి:

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    శాసన సభ స్థానాలు:

    • షాకోట్‌(పంజాబ్‌): కాంగ్రెస్ (గెలుపు)

    • పశ్చిమ బెంగాల్ మహేస్థల: టిఎంసి (గెలుపు)

    • జోకిహట్‌(బిహార్‌):  ఆర్జేడీ (గెలుపు)

    • గొమియా(జార్ఖండ్‌): బీజేపీ (గెలుపు)

    • సిల్లీ(జార్ఖండ్‌): జెఎంఎం (గెలుపు)

    • చెంగన్నూరు(కేరళ):  సీపీఎం (గెలుపు)

    • నూపుర్‌(ఉత్తర ప్రదేశ్‌): సమాజ్వాది (గెలుపు)

    • థరాలి(ఉత్తరాఖండ్‌): బీజేపీ (గెలుపు)

    • అంపటి (మేఘాలయ): కాంగ్రెస్ (గెలుపు)

    • పాలుస్‌ కడేగావ్‌(మహారాష్ట్ర): కాంగ్రెస్ (గెలుపు)

    • రాజరాజేశ్వరి నగర్(కర్ణాటక): కాంగ్రెస్ (గెలుపు)

  • థరాలి(ఉత్తరాఖండ్‌) అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.

     

  • కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్ లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న 41162 ఓట్లతో గెలుపొందారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    జోకిహట్‌(బిహార్‌) శాసనసభ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి షానవాజ్‌  తన సమీప ప్రత్యర్థి, జేడీయూ అభ్యర్థిపై 16299 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

    మహారాష్ట్రలోని పాల్ఘర్‌ లోక్‌సభ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి రాజేంద్ర 22 వేల ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

    నాగాలాండ్ లోక్‌సభ బైపోల్: నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తన సమీప ఎన్పీఎఫ్ అభ్యర్థిపై  బీజేపీ-ఎన్డీపీపీ కూటమి అభ్యర్థి 34,669 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని నూర్పూర్ అసెంబ్లీ స్థానంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి 6211 ఓట్లతో గెలుపొందారు.

     

  • 4 లోక్ సభ స్థానాలు:

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      కైరానా(ఉత్తర్ ప్రదేశ్): ఆర్ఎల్డీ (ఆధిక్యం)

    • పాల్ఘర్(మహారాష్ట్ర): బీజేపీ (ఆధిక్యం)

    • భండారా–గోండియా(మహారాష్ట్ర): ఎన్సీపీ (ఆధిక్యం)

    • నాగాలాండ్: బీజేపీ కూటమి ఎన్డీపీపీ (ఆధిక్యం)

  • 11 అసెంబ్లీ స్థానాలు:

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      షాకోట్‌(పంజాబ్‌): కాంగ్రెస్ (ఆధిక్యం)

    • పశ్చిమ బెంగాల్ మహేష్తల: టిఎంసి (ఆధిక్యం)

    • జోకిహట్‌(బిహార్‌):  ఆర్జేడీ (ఆధిక్యం)

    • గొమియా(జార్ఖండ్‌): బీజేపీ (ఆధిక్యం)

    • సిల్లీ(జార్ఖండ్‌): జెఎంఎం (ఆధిక్యం)

    • చెంగన్నూరు(కేరళ):  సీపీఎం (ఆధిక్యం)

    • నూపుర్‌(ఉత్తర ప్రదేశ్‌): సమాజ్వాది (ఆధిక్యం)

    • థరాలి(ఉత్తరాఖండ్‌): బీజేపీ (ఆధిక్యం)

    • అంపటి (మేఘాలయ): కాంగ్రెస్ (విజయం)

    • పాలుస్‌ కడేగావ్‌(మహారాష్ట్ర): కాంగ్రెస్ (విజయం)

    • రాజరాజేశ్వరి నగర్(కర్ణాటక): కాంగ్రెస్ (ఆధిక్యం)

  • కైరానా లోక్‌సభ బైపోల్: 13 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్, తన సమీప బీజేపీ ప్రత్యర్థి మ్రిగాంకా సింగ్ కంటే 41391 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    పంజాబ్‌లోని షాకోట్ అసెంబ్లీ స్థానంలో 11వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి హర్వేద్ సింగ్ షిరోమణి అకాలీదళ్ అభ్యర్థి నయిబ్ సింగ్ కంటే 27049 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

    నూర్పూర్ అసెంబ్లీ బైపోల్: 20వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి సమాజ్వాది పార్టీ అభ్యర్థి 10208 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

  • కేరళలోని చెంగనూర్‌ అసెంబ్లీ స్థానంలో సీపీఎం అభ్యర్థి సాజీ చెరియాన్ 14229 ఓట్లతో  ముందంజలో ఉన్నారు. కేరళలో ప్రస్తుతం లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

  • కర్ణాటక: రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న 12వ రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 46593 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. బెంగళూరులోని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

     

  • మహారాష్ట్ర: పాల్ఘర్ లోక్‌సభ స్థానంలో తొమ్మిది రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి గవిత్ రాజేంద్ర ధేద్య 17843 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. శివసేన అభ్యర్థి శ్రీనివాస్ చింతామన్ వంగ రెండో స్థానంలో నిలిచారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    జార్ఖండ్‌లోని సిల్లి అసెంబ్లీ స్థానంలో జేఎంఎం అభ్యర్థి సీమా దేవి ఎనిమిదో రౌండ్ కౌంటింగ్‌లో 662 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

    కైరానా లోక్‌సభ బైపోల్: 9 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్, తన సమీప బీజేపీ ప్రత్యర్థి మ్రిగాంకా సింగ్ కంటే 26925 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

  • కర్ణాటక: పదో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి రాజరాజేశ్వరి నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న 46218 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    నాగాలాండ్ లోక్‌సభ బైపోల్: నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎన్పీఎఫ్ అభ్యర్థి 11 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

     

     

     

  • కాంగ్రెస్ అభ్యర్థి మియని డి శిర మేఘాయలోని అంపటి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు.

     

  • కైరానా లోక్ సభ బైపోల్: 8 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్, తన సమీప బీజేపీ ప్రత్యర్థి మ్రిగాంకా సింగ్ కంటే 19900ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    బీహార్: 14 రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి జోకిహట్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి 16299 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

     

  • జార్ఖండ్: సిల్లి అసెంబ్లీ స్థానంలో జేఎంఎం అభ్యర్థి సీమాదేవి ఆరో రౌండ్ కౌంటింగ్ లో 296 ఓట్లతో ముందంజలో ఉంది.

    మహారాష్ట్ర: పాల్ఘర్ లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏడో రౌండ్ కౌంటింగ్ లో 17417 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

  • నూర్పూర్ అసెంబ్లీ బైపోల్: 14వ రౌండ్ కౌంటింగ్ లో  సమాజ్వాది పార్టీ అభ్యర్థి 5100 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    కేరళలోని చెంగనూర్‌ అసెంబ్లీ స్థానంలో  సీపీఎం అభ్యర్థి  9359 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

    ఉత్తరాఖండ్: థరాలి అసెంబ్లీ స్థానంలో ఐదో రౌండ్ కౌంటింగ్ లో కాంగ్రెస్ 198 ఓట్లతో ముందంజలో ఉంది.

     

  • కర్ణాటకలోని రాజరాజేశ్వరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి 44000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    మహారాష్ట్రలో భండారా–గోండియా లోక్ సభ స్థానంలో ఎన్సీపీ నాలుగో రౌండ్ కౌంటింగ్ లో 3959 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.

    మహేస్థల( పశ్చిమబెంగాల్‌) అసెంబ్లీ స్థానంలో తృణముల్ అభ్యర్థి దుళాల్ చంద్ర దాస్ పదో రౌండ్ ముగిసేసరికి 33000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

  • అంపటి (మేఘాలయ) అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

     

  • కైరనా లోక్‌సభ బైపోల్: ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్, బీజేపీ అభ్యర్థి మ్రిగాంకా సింగ్ కంటే 16000 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

     

  • జార్ఖండ్‌లోని గొమియా అసెంబ్లీ స్థానంలో ఆరో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 7174 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.

     

  • మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి గవిత్ రాజేంద్ర ధేద్య 14000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. శివసేన రెండో స్థానంలో నిలిచింది.

     

  • కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్(రాజరాజేశ్వరి నగర్) అసెంబ్లీ స్థానంలో ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న 32000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీజేపీ, జేడీఎస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

     

  • షాకోట్‌(పంజాబ్‌) అసెంబ్లీ స్థానంలో ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి 12000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

     

  • మహారాష్ట్రలోని భండారా–గోండియా లోక్ సభ స్థానంలో ఎన్సీపీ 3100 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండో స్థానంలో ఉంది.

     

  • మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి గవిత్ రాజేంద్ర ధేద్య 10000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. శివసేన రెండో స్థానంలో నిలిచింది. తొలి రౌండ్‌లో శివసేన బీజేపీకి గట్టి పోటీనిచ్చింది.
     

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

  • కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్(రాజరాజేశ్వరి నగర్) అసెంబ్లీ స్థానంలో నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న 18000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీజేపీ, జేడీఎస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

     

  • మహేస్థల( పశ్చిమబెంగాల్‌) అసెంబ్లీ స్థానంలో ఆరో రౌండ్ ముగిసేసరికి తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి దుళాల్ చంద్ర దాస్ 20వేల ఓట్లతో ముందజలో ఉన్నారు. సీపీఐ(ఎం), బీజేపీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

     

  • కేరళలోని చెంగనూర్‌లో సీపీఎం అభ్యర్థి సాజీ చెరియాన్ 3106 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

     

  • కైరనా లోక్ సభ బైపోల్: ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ బీజేపీ అభ్యర్థి మ్రిగాంకా సింగ్ కంటే 3000 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

     

  • జార్ఖండ్ లోని  సిల్లీ ఉప ఎన్నికల్లో ఆల్ జర్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అభ్యర్థి సుదేష్ మహతో ఆధిక్యంలో ఉన్నారు. గొమియాలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

     

  • నూపుర్‌(ఉత్తర ప్రదేశ్‌) అసెంబ్లీ ఉపఎన్నికలో సమాజ్వాది పార్టీ అభ్యర్థి  9000 ఓట్లకు పైగా తేడాతో ఆధిక్యంలో ఉన్నారు.

     

  • ఉత్తరాఖండ్‌లోని థరాలి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి 339 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

     

  • జోకిహట్‌(బిహార్‌) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి ముర్శిద్ ఆలం 3000 ఓట్ల ఆధిక్యతతో ముందజలో ఉన్నారు.

     

  • కైరనా బైపోల్: తొలి రౌండ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ కు 3700 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి మ్రిగాంకా సింగ్ కు 3746 ఓట్లు వచ్చాయి-ఇంద్ర విజయ్ సింగ్, కలెక్టర్, షామిలి

     

  • మహారాష్ట్రలోని పాలుస్‌ కడేగావ్‌ లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ పతంగరావ్ కదం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఇదే నియోజక వర్గం నుండి గెలిచిన కాంగ్రెస్ నేత పతంగరావ్ కదం మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో ఎన్నికలకు ముందే ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. 

     

  • జోకిహట్‌(బిహార్‌) స్థానంలో ఆర్జేడీ ఆధిక్యంలో ఉంది.

    జార్ఖండ్ సిల్లి అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

  • ఉత్తర్‌ప్రదేశ్ లోని కైరానా లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి మ్రిగాంకా సింగ్ రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి తబస్సుమ్ హసన్ కంటే ముందంజలో ఉన్నారు.

  • కేరళలోని చెంగనూర్‌లో సీపీఎం అభ్యర్థి సాజీ చెరియాన్ ముందంజలో ఉన్నారు. కేరళలో ప్రస్తుతం లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

     

  • ఆర్ఆర్ నగర్‌లో తొలి రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ కంటే ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న 8,680 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.రెండో స్థానంలో బీజేపీ, జేడీఎస్ మూడో స్థానంలో ఉంది.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

     

  • పశ్చిమ బెంగాల్‌లోని మహేస్థల అసెంబ్లీ స్థానంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి దుళాల్ చంద్ర దాస్ రెండో రౌండ్ లెక్కింపు తర్వాత 10,000 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.

     

  • పంజాబ్ లోని షాకోట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మొదటి రౌండ్లో 2000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అయిన లడ్డి షెరోవాలియా ముందంజలో ఉన్నారు.

     

  • తొలి రౌండ్‌లో సమాజ్వాది పార్టీ నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉంది.

     

  • మహారాష్ట్ర: భండారా–గోండియా లోక్ సభ స్థానంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

     

  • కర్ణాటక: రాజరాజేశ్వరి నగర్ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతున్న జ్ఞానాక్షి స్కూల్ పరిధిలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఒక డీసీపీ, 4 ఏసీపీలు, 10 మంది ఇన్స్‌పెక్టర్లు, 20 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లు, ప్రత్యేక పోర్స్‌ను మోహరించారు. ఇక్కడ అభ్యర్థి గెలవాలంటే 50,000 ఓట్లు రావాలి.

  • మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఓట్లలెక్కింపు కేంద్రంలో కౌంటింగ్ మొదలైంది.

     

    పాల్‌ఘర్‌లో శివసేన అభ్యర్థి శ్రీనివాస్ వాంగా ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గవిట్ వెనుకంజలో ఉన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link