Mizoram Election Result 2023 Live: మిజోరం ఎన్నికల్లో ఫలితాల్లో ZPM విజయం.. అధికార పార్టీ ఇంటిముఖం
Mizoram 2023 Assembly Election Result Live: మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటల నుంచి మొదలుకానుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎవరు అధికారంలోకి వస్తారు..? కాంగ్రెస్, బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతాయి..? మిజోరం అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలతో పాటు మిజోరం ఎన్నికల కౌంటింగ్ కూడా ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తుల మేరకు ఎన్నికల సంఘం ఒకర రోజు వాయిదా వేసింది. ఆదివారం క్రైస్తవులు సామూహిక ప్రార్థనలకు హాజరవుతున్నందున వారికి పవిత్రమైన రోజు అని.. కౌంటింగ్ తేదీని మార్చాలని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు కోరారు. మిజోరాం క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రం. వారి రిక్వెస్ట్ మేరకు ఈసీ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరగ్గా.. రాష్ట్రంలో మొత్తం 80.66 శాతం ఓటింగ్ నమోదైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) మధ్య హోరాహోరీ పోరును ఉంటుందని తేల్చాయి. మరి అధికారంలోకి ఎవరు వస్తారు..? బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని సీట్లు సాధిస్తాయి..? మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ ఫాలో అవ్వండి..
Latest Updates
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరంలోని సెర్చిప్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహోమా విజయం సాధించారు.
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరం ఎన్నికల్లో ZPM పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 27 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. అధికార MNF పార్టీ కేవలం 10 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 2, కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకున్నాయి.
Mizoram Election 2023 Counting Live Updates: ZPM పార్టీ సీట్లు ఇవే..
==> కొలాసిబ్ (5)- లాల్ఫాంకిమా
==> చల్ఫిల్హ్ (8)- లాల్బియాక్జమా
==> తావి (9) - ప్రొ. లాల్నీలావ్మా
==> ఐజ్వాల్ నార్త్-I(10) - లాల్తన్‌సంగా
==> ఐజ్వాల్ నార్త్-II(11) - డాక్టర్ సప్దంగా
==> ఐజ్వాల్ వెస్ట్-I(15) - TBC లాల్వెంచుంగ
==> ఐజ్వాల్ వెస్ట్-II(16) - లాల్గింగ్లోవా హ్మర్
==> ఐజ్వాల్ వెస్ట్-III(17) - VL జైతాంజమా
==> ఐజ్వాల్ సౌత్-I(18) - సి.లాల్సావివుంగా
==> ఐజ్వాల్ సౌత్-II(19 సౌత్)-II లాల్చువాంతంగా
==> ఐజ్వాల్ సౌత్-III(20)- బారిల్ వన్నెయిహ్సాంగి
==> లెంగ్‌టెంగ్(21) - ఎఫ్.రోడింగ్లియానా
==> టుయిచాంగ్(22)- డబ్ల్యూ చువానావ్మా
==> చంఫై నార్త్ (23) - హెచ్ గింజలాలా
==> చాంఫై సౌత్(24)- లెఫ్ట్‌నెంట్ కల్నల్ సెర్చ్ క్లెమెంట్ లాల్దుహోమా
==> టుయికుమ్(27)- పీసీ వన్‌లాల్రువాటా
==> హ్రాంగ్‌టుర్జో(28)- లాల్మున్‌పుయా పుంటే
==> సౌత్ టుయిపుయ్(29) - జెజె లాల్‌పెఖ్లువా
==> లుంగ్లీ ఈస్ట్(31)- లాల్‌రిన్‌పుయి
==> లుంగ్లీ వెస్ట్(32) - టి.లాంగ్‌లీపుయాల్
==> లాంగ్లీపుయామ్ (32)
==> లై తూర్పు (38)- డాక్టర్ లోరైన్ లాల్పెక్లియానా చిన్జా
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరం ఎన్నికల ఫలితాల్లో సంచలన ఫలితం వచ్చింది. సీఎం జోరమ్‌తంగా ఐజ్వాల్ ఈస్ట్-1 స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. జోరాం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థి లాల్తన్‌సంగా ముఖ్యమంత్రిపై 2,101 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Mizoram Election 2023 Counting Live Updates: ZPM ఇప్పటికే 20 స్థానాల్లో విజయం సాధించారు. మరో 7 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ ఆధిక్యం దిశంగా వెళుతోంది.
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరం ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసినా.. ఒక్క సీటులోనే ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
Mizoram Election 2023 Counting Live Updates: పాలక్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కె.హ్రమో MN అభ్యర్థి KT రోఖాను 1,241 ఓట్లతో ఓడించారు.
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరంలో అధికారం దిశగా ZPM దూసుకుపోతుంది. ఇప్పటివరకు రెండుస్థానాల్లో విజయం సాధించగా.. ఆ పార్టీ అభ్యర్థులు 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM)- 29 (విజయాలు + ఆధిక్యం)
మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) - 7 (ఆధిక్యం)
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) - 3 (ఆధిక్యం)
కాంగ్రెస్ - 1 (ఆధిక్యం)
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సి.నుగిన్లియాన్‌చుంగా మాత్రమే ముందంజలో ఉన్నారు. MNFకి చెందిన వి.జిర్‌సంగా కంటే 481 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Mizoram Election 2023 Counting Live Updates: ZPM అధికారం దిశగా దూసుకెళ్తోంది. 25 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మేజిక్ ఫిగర్ 20 సీట్లు దాడి ఆధిపత్యం చెలాయిస్తోంది. అధికార MNF 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. BJP మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2008-2018 మధ్య కాలంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కేవలం ఒక్క సీటులో ఆధిక్యంతో ఉంది.
Mizoram Election 2023 Counting Live Updates: టుయిచాంగ్ నియోజకవర్గం నుంచి ZPM అభ్యర్థి డబ్ల్యూ చువాన్వామా గెలుపొందారు. రెండు రౌండ్ల ఓట్ల కౌంటింగ్ తరువాత ఆయన 909 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు.
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ZPM అభ్యర్థులు దూకుడు కనబరుస్తున్నారు. ZPM అభ్యర్థులు 23 సీట్లలో ముందంజలో ఉండగా.. MNF 13, కాంగ్రెస్ 1, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తున్నాయి.
Mizoram Election 2023 Counting Live Updates: ఐజ్వాల్ వెస్ట్-1లో ZPM అభ్యర్థి లాల్వెంచుంగ మొదటి రౌండ్ కౌంటింగ్ తర్వాత 1,298 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి మూడు రౌండ్ల కౌంటింగ్ జరగనుంది.
Mizoram Election 2023 Counting Live Updates: ప్రస్తుతం MNF 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ZPM 5 స్థానాల్లో ఉంది.
Mizoram Election 2023 Counting Live Updates: కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది
Mizoram Election 2023 Counting Live Updates: ఈశాన్య రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరం అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Mizoram Election 2023 Counting Live Updates: అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), ప్రతిపక్ష పార్టీ జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), కాంగ్రెస్ మొత్తం 40 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాయి. 23 స్థానాల్లో బీజేపీ పోటీ పడుతుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టింది. 27 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Mizoram Election 2023 Counting Live Updates: రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాలు, 40 కౌంటింగ్ హాళ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు మిజోరాం ప్రధాన ఎన్నికల అధికారులు తెలిపారు. 40 కౌంటింగ్ హాళ్లలో 399 ఈవీఎం టేబుల్స్, 56 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని చెప్పారు.
Mizoram Election 2023 Counting Live Updates: మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సెర్చిప్‌లోని కౌంటింగ్ కేంద్రంలో అధికారులు చేరుకుంటున్నారు.