Rain Alert Live Updates: ముంచుకొస్తున్న వాయు`గండం`..తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..!

Tue, 09 Aug 2022-4:22 pm,

Rain Alert Live Updates: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడం మరికొన్ని గంటల్లో వాయుగుండం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Rain Alert Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ముసురు పట్టుకుంది. నిన్నటి నుంచి ఏకధాటిగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

Latest Updates

  • ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
    భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
    42.90 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి
    మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ

  • శ్రీశైలం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద
    దిగువకు నీటి విడుదల
    ఇన్‌ ఫ్లో లక్షా 60 వేల 901 క్యూసెక్కులు
    ఔట్ ఫ్లో 2 లక్షల 30 వేల 944 క్యూసెక్కులు
    పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
    ప్రస్తుతం 994.80 అడుగులు
    పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు
    ప్రస్తుతం 214.3637 టీఎంసీలు

  • ఇవాళ ఏపీకి కేంద్ర బృందాలు
    రేపు, ఎల్లుండి ముంపు ప్రాంతాలకు కేంద్ర బృందాలు
    వరద నష్టం అంచనా వేయనున్న అధికారులు
    అనంతరం సీఎం జగన్‌తో సమావేశం
    త్వరలో కేంద్రానికి నివేదిక

  • గోదావరి ఉధృతి
    ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు
    లోతట్టు ప్రాంతాలు జలమయం
    ఏపీ-ఒడిశా సరిహద్దులోని రహదారిపైకి వరద నీరు
    రాకపోకలకు అంతరాయం

  • హైదరాబాద్‌లో ముసురు
    అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షం
    లోతట్టు ప్రాంతాలు జలమయం
    అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ
    డ్రైనేజీలపై నిఘా
    గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

  • వాయవ్య బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
    ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం
    తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
    కోస్తాంధ్రలో కుండపోత వానలు
    తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
    సముద్ర తీరం వెంట గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు
    అప్రమత్తమైన విపత్తుల నిర్వహణ శాఖ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link