Lizard in McDonalds: శీతల పానీయంలో బల్లి చనిపోయిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో భార్గవ జోషి అనే కస్టమర్ ను వచ్చిన ఫిర్యాదు మేరకు.. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవాంగ్ పటేల్ రంగంలోకి దిగారు. పరీక్ష కోసం అవుట్‌లెట్ నుంచి శీతల పానీయాల నమూనాలను సేకరించి.. ఆ తర్వాత అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత శనివారం గుజరాత్ లోని సోలా మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌ను సీలు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూల్ డ్రింక్ లో బల్లి..


కస్టమర్ భార్గవ జోషి తన శీతల పానీయంలో బల్లి ఈదుతున్న వీడియోను శనివారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భార్గవ జోషి.. అతని స్నేహితులు సోలాలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో తమ ఫిర్యాదును ఎవరూ తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అయితే కూల్ డ్రింక్ కోసం చెల్లించిన రూ. 300 వాపసు ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత భార్గవ జోషి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 


జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు ముందస్తు అనుమతి లేకుండా తమ మెక్ డొనాల్డ్ ఔట్ లెట్ ను తెరిచేందుకు వీలు లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే జరిగిన సంఘటనపై మెక్ డొనాల్డ్ సంస్థ స్పందించింది. తమ రెస్టారెంట్లలో 42 సేఫ్టీ చెక్ ప్రోటోకాల్ ను అమలు చేస్తామని వారు తెలిపారు. 


Also Read: Viral Video: సెల్ఫీ కోసం బైక్ పై నిల్చొని విన్యాసం.. కట్ చేస్తే బొక్కబోర్ల పడి..!


Also Read: Instagram Reel: ఎంతో కష్టమైన వ్యాయామాన్ని ఈ అమ్మాయి చాలా సులభంగా చేసేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook