LK Advani on Rammandir: ఆ ఇద్దరినీ మిస్ అవుతున్నా..బాదగా ఉంది
LK Advani on Rammandir: అయోధ్య రామమందిరం ప్రారంభం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. ఈ సందర్భంగా రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభించిన బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు మీ కోసం..
LK Advani on Rammandir: అయోధ్యలో రామమందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. అయోధ్య నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా రామ జన్మభూమి ఉద్యమం, రామమందిరం ప్రారంభం గురించి ఉద్యమ సారధి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ రాసిన ఓ వ్యాసం చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా ఇద్దరిని మిస్ అవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అద్వానీ మిస్ అవుతున్న ఆ ఇద్దరెవరు..
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన రామ జన్మభూమి ఉద్యమం లౌకిక వాదానికి అసలైన నిర్వచనంలా నిలిచిందని ఎల్‌కే అద్వానీ అభిప్రాయపడ్డారు. శ్రీ రామమందిరం నెరవేరిన దివ్య కల పేరుతో ఆయన రాసి వ్యాసంలోని కొంత భాగాన్ని అద్వానీ కార్యాలయం విడుదల చేసింది. రామ జన్మభూమి ఉద్యమం సందర్భంగా నిఖార్సైన లౌకికవాదం వర్సెస్ కుహనా లౌకికవాదం మధ్య ప్రత్యేక చర్చ జరిగిందన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని కళ్లారా చూడటం వల్ల తన జన్మ ధన్యమైందన్నారు.
1990లో రామమందిరం నిర్మాణం కోసం రథయాత్ర ప్రారంభంచినప్పుడు ప్రజల్నించి పుష్కలంగా మద్దతు లభించిందని అద్వానీ ఆ వ్యాసంలో రాశారు. ఆ సమయంలో చాలా రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్లు పోతాయనే భయంతో వెంట నడిచేందుకు ఆసక్తి చూపించలేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగినవాళ్లు సెక్యులరిజం పేరుతో తమ వైఖరిని సమర్ధించుకున్నారని అద్వానీ తెలిపారు. అయోద్య భూ వివాదంపై కోర్టులో నిర్ణయాత్మక తీర్పుతో రామమందిర నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
ఆ ఇద్దరూ లేకపోవడం బాధాకరం
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న శుభ సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు లేని లోటు బాధిస్తోందని అద్వానీ చెప్పారు. ఒకరు తన భార్య కమల కాగా రెండో వ్యక్తి మాజీ ప్రధాని వాజ్ పేయి అని చెప్పారు. వాజ్‌పేయి తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో అంతర్భాగం కాగా భార్య కమల తన ప్రజా జీవిత ప్రస్థానంలో స్థిరత్వం, అసమాన బలం చేకూర్చిన మహిళ అన్నారు. ఈ సమయంలో ఆ ఇద్దరూ లేకపోవడం బాధగా ఉందన్నారు.
Also read: Delhi: ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. సున్నాకి పడిపోయిన విజిబిలిటీ.. ఆలస్యంగా 22 రైళ్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook