Navneet Kaur Rana: కార్యకర్తలా సేవలందిస్తా.. అమిత్ షాను కలిసిన అమరావతి ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా..
Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తనదైన మార్కుతో ముందుకు పోతుంది. ఇప్పటికే ఎన్నికల బరిలో పలువురు గ్లామరస్ స్టార్ లకు ఎంపీ టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ రాణాకు అవకాశం కల్పించింది.
Amravati MP Candidate Navneet Rana Meets Amit Shah: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అన్నిరాజకీయ పార్టీలు తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికలలో గెలిచి, హ్యాట్రిక్ కొట్టాడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే విధంగా బీజేపీ ఉండే విధంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలో.. అటూ కాంగ్రెస్ పార్టీకూడా దేశంలో ఈసారైన తమ పార్టీ అధికారం సాధించాలని రాహుల్ పాదయాత్రలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా కూటమి ముఖ్యంగా, మోదీని ఓడించడమే ఏకైక టార్గెట్ గా దేశంలోని అనేక పార్టీలన్ని కలసి కూటమిగా ఏర్పాడ్డాయి. ఈ క్రమంలోనే బీజేపీ మాత్రం తనదైన స్టైల్ లో ఎన్నికలలో అభ్యర్థులను నిలబెడుతుంది.
Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?
బీజేపీ రాజకీయ చరిష్మా,గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఈక్రమంలోనే ఇప్పటికే పలువురు సీనితారలకు కూడా బీజేపీ టికెలు కేటాయంచిన విషయం తెలిసిందే. ఇదివరకే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ లతో పాటు, తెలుగు నటి నవనీత్ కౌర్ రాణాకు సైతం మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. నవనీత్ కౌర్..గతంలో అనేక తెలుగు సినిమాల్లో నటించారు. నవనీత్ కౌర్ ప్రస్తుతం ఇదే స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
గతంలో ఆమె 2019 లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి, శివసేనకు చెందిన ఆనందరావ్ అద్సుల్ పై విజయం సాధించారు. నవనీత్ కౌర్.. రూమ్ మెట్స్, మహారథి, జాబిలమ్మ, యమదొంగ, గుడ్ బాయ్ పలుసినిమాల్లో నటించారు. ఈక్రమంలో ఎంపీ అభ్యర్థిగా నవనీత్ కు టికెట్ ఇవ్వడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
ప్రధానిమోదీ, హోంమంత్రి అమిత్ షాకు, నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా.. ఈరోజు ప్రత్యేకంగా నవనీత్ కౌర్ రాణా, తన భర్త రవిరాణా తో కలిసి హోంమంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. బీజేపీకి గెలుపు కోసం ఒక కార్యకర్తలా పని చేస్తానని ఆమె అన్నారు. తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook