Lok Sabha Election Results 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మొదలైన పోస్టల్ బ్యాలెట్ తో పాటు ఈవీఎంల లెక్కింపు మొదలైంది. అనూహ్యంగా ఈ ఎన్నికల ఫలితాల్లో వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 6 వేలకు పైగా వెనకంజలో ఉండటం బీజేపీ శ్రేణులను దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. గత రెండు పర్యాయాలు ఈ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. మొదటి రెండు రౌండ్ల ఫలితాల్లో ఇది వెల్లడైంది. మిగతా రౌండ్లలో ఎలాంటి ఫలితం రాబోతుందో చూడాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన కేరళ వాయనాడ్ మరియు రాయబరేలి నుంచి ముందంజలో ఉన్నారు. దాదాపు అన్ని సర్వేలు ఈ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టడం ఖాయమనే చెబుతున్నాయి. మరి రెండు స్థానాలు గెలిస్తే.. ఏ స్థానాన్ని రాహుల్ గాంధీ ఒదులు కుంటారనేది ఆసక్తికరంగా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook