Advani - Manmohan Singh: జనరల్ ఎలక్షన్స్‌లో భాగంగా 80 యేళ్లు దాటిన పెద్దలకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎంతో మంది పెద్దలు తమ ఇంటి నుంచే ఓటు వేసారు. తాజాగా ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు భారతరత్న లాల్ కృష్ణ అద్వానీతో పాటు మరో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా తమ నివాసం నుంచే ఓటు హక్కు యూజ్ చేసుకున్నారు. అటు మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కూడా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీఓని ఏడు లోక్‌సభ సీట్లకు 6వ విడతలో భాగంగా ఈ నెల 25న శనివారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్‌కు రాలేని పెద్దవాళ్లతో పాటు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఓట్లు వేయిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తంగా గురువారం నుంచి షురూ అయింది. మే 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. గత గురువారం హమీద్ అన్సారీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం మన్మోహన్ సింగ్, మురళీ మనోహర్ జోషి ఇంటి నుంచే ఓటు వేసారు. అటు భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు భారతరత్న ఎల్.కే.అద్వానీ శనివారం తన నివాసంలో ఓటు వేసారు. వీరంత ఢిల్లీలోని 7 లోక్‌సభ సీట్లలో బరిలో ఉన్న అభ్యర్ధులకు ఓటు వేశారు. ఇక్కడ మే 25న 57 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.


ఇక దేశ వ్యాప్తంగా 49 సీట్లకు ఐదో విడతలో భాగంగా రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో 695 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో రాజ్‌నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా, స్మృతి ఇరానీ సహా పలువురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 7 విడతల్లో జరిగే లోక్ సభ ఎన్నికలు జూన్ 1న చివరి విడత ఎన్నికలతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది. జూన్ 4న 542 లోక్‌సభ సీట్లతో పాటు అరుణాల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా అసెంబ్లీలకు ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.


Also Read: Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter