First day of Parliament Winter Session, the Lok Sabha passed the Farm Laws Repeal Bill 2021: పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే.. నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు లోక్​ సభముందుకు (Lok Sabha Passed Farm laws repeal bill) వచ్చింది. దీనిని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ ప్రవేశ పెట్టగా.. స్పీకర్ ఓం బిర్లా పాస్​ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వైపు విపక్షాల గందరగోళం కొనసాగుతుండగానే.. బిల్లుకు అమెదం లోక్​ సభ ఆమోదం లభించింది.


చర్చకు విపక్షాల డిమాండ్​..


సాగు చట్టాల రద్దు బిల్లుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టగా.. అందుకు స్పీకర్ (Lok Sabha speaker Om Birla)​ అంగీకరించలేదు. దీనితో సభలో గందరగోళం నెలకొంది. దీనితో మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది.


సాగు చట్టాల రద్దు ఎందుకు?


వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చే విధంగా మూడు సాగు చట్టాలను (New Farm laws) గత ఏడాది తీసుకొచ్చింది కేంద్రం. అయితే ఈ సాగు చట్టాలపై రైతుల్లో అసంతృప్తి నెలకొంది. దీనితో వాటని ఉపసంహరించుకోవాలని నిరసనలకు దిగారు. పంజాబ్, హరియాణా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని ధర్నాలు చేశారు. పలు మార్పులు ఈ ధర్నాలు హింసాత్మకంగా కూడా మారాయి.


ఈ ధర్నాలకు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్​ ముందున్నారు.


ధర్నాలు చేస్తున్న రైతులపైన నుంచి ఉత్తర్​ ప్రదేశ్​లో కేంద్ర మంత్రి కుమారుడి వాహనం తొక్కుకుంటూ వెళ్లడం వల్ల పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.


దీనితో ఈ వివాదాలన్నింటికి ముగింపు పలికేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా (PM Modi on New Farm laws) ప్రకటించారు. గురునానక్ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే సాగు చట్టాల రద్దు బిల్లును నేడు లోక్​ సభ ముందుకు తెచ్చింది కేంద్రం.


ఇదిలా ఉండగా.. రైతులు ఆందోళనలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. పంటకు కనీస మద్ధతు ధర చట్టం రూపం దాల్చే వరకు నిరసనలు కొనసాగుతాయని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇటీవలే రైతుల నిరసనలు ఏడాది పూర్తి చేసుకోవం గమనార్హం.


Also read: Corona Cases In India: దేశంలో కొత్తగా మరో 8,309 కరోనా కేసులు.. 236 మరణాలు


Also read: Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రత నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook