Lok Sabha Polls 2024 2nd Phase: భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 18వ లోక్ సభకు ఈ నెల 19న తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాయి.  తొలి దశలో 65.5 శాతం పోలింగ్ జరిగింది.  రెండో దశలో భాగంగా కేరళ, కర్ణాటకతో పాటు  దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ స్టార్ట్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ మొదలైంది. తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలు కలిపి 89 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లకు  ఏడు విడతల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తోంది.  ఇందులో కేరళలోని 20 స్థానాలు, కర్ణాటకలోని 14 స్థానాలు.. రాజస్థాన్‌లోని 13, అస్సామ్‌, బిహార్‌లోని 5 స్థానాలు..మధ్య ప్రదేశ్‌లోని 7 స్థానాలు.. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌లోని లోని 8 స్థానాలు.. వెస్ట్ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌లోని 3 స్థానాలు..
జమ్మూ కశ్మీర్‌లో జమ్మూ స్థానానికి, త్రిపుర, మణిపూర్‌లోని ఒక్కో స్థానానికి ఎన్నికలు ప్రారంభమైంది.  ఈ విడతతో కేరళ, రాజస్థాన్‌, అస్సామ్, త్రిపుర, మణిపూర్  రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తైవుతోంది.


ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు  జరగనుంది. ఎన్నికల బరిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ సహా పలు ప్రాంతీయ పార్టీలు తమ లక్‌ను  పరీక్షించుకోబోతున్నాయి.


ఈ దశ పోలింగ్‌లో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం  భూపేష్ భగల్ రాజ్ నందగావ్ నుంచి బరిలో ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం తమ్ముడు డీకే సురేష్ బెంగళూరు మీణం నుంచి పోటి పడుతున్నారు. అటు  శోభ కరంద్లాజే బెంగళూరు నార్త్ నుంచి భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు  తేజస్వి సూర్య... బెంగళూరు దక్షిణం నుంచి పోటీ చేస్తున్నారు. అటు జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి మాండ్యా నుంచి బరిలో ఉన్నారు. అటు బీజేపీ తరుపున మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోని కుమారుడు  అనిల్ ఆంటోని ..పతన తిట్ట నుంచి బీజేపీ నుంచి పోటీ పుడుతున్నారు. అటు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ తరుపున తిరువనంత పురం నుంచి బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ తరుపున
 శశిథరూర్ పోటీ చేస్తున్నారు.  వైభవ్ గెహ్లాత్ (జలోర్), రాజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్ పూర్) నుంచి బరిలో ఉన్నారు. లోక్ సభ స్పీకర్..ఓం బిర్లా కోటా బీజేపీ నుంచి బరిలో ఉన్నారు.  టీవీ రాముడైన అరుణ్ గోవిల్  (మీరట్), హేమా మాలిని (మధుర) నుంచి బీజేపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు.


ఈ ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 191స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో ఐదు విడతల్లో 352 లోక్ సభ  స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా ఏడు దశల ఎన్నికల తర్వాత జూన్ 4వ తేదిన ఓట్ల లెక్కింపు జరగనుంది.


Also Read: YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్‌.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter