Lok Sabha Speaker: 18వ లోక్ సభకు తిరిగి వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు.  రాజస్థాన్ లోని కోటా లోక్ సభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తాజాగా పార్లమెంట్ ప్రారంభమైన కొద్ది సేపటిలో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న భర్తృహరి మహతాబ్.. మూజువాణి ఓటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది  సభ్యులు లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లాకు మద్దతు తెలిపినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు  కలిసి కొత్త స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాను ఆయన స్పీకర్ స్థానంలో  కూర్చొబెట్టారు.  అప్పటి వరకు ఆ  స్థానంలో ఉన్న భర్తృహరి మహతాబ్ తన స్థానాన్ని ఖాళీ చేసి ఓం బిర్లాకు స్పీకర్ సీటును అప్పగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓం బిర్లా ఎన్నిక వెనక పెద్ద రీజనే ఉంది. గత పార్లమెంట్ సెషన్ లో పలు కీలక బిల్లుల ఆమోదంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా కేంద్రం దేశాన్ని దిశా నిర్దేశం చేసే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో సభను సజావుగా నడపడంలో అనుభవం ఉన్న ఓం బిర్లాను తిరిగి లోక్ సభ స్పీకర్ గా ఎన్నుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు కాంగ్రెస్ నేత బలరాం జక్కడ్ తర్వాత పూర్తి కాలం పదవిలో ఉండి.. తిరిగి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఓం బిర్లా పూర్తి కాలం ఈ పదవిలో ఉన్న తర్వాత ఎన్నిక అయిన రెండో స్పీకర్ గా రికార్డు క్రియేట్ చేశారు.


అటు అనంత శయనం అయ్యంగార్, నీలం సంజీవ్ రెడ్డి, జీఎంసీ బాలయోగి రెండు సార్లు లోక్ సభ స్పీకర్ గా పనిచేసినా.. పూర్తి కాలం మాత్రం పనిచేయలేదు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ తరుపున వరుసగా రెండోసారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తిగా ఓం బిర్లా రికార్డులకు ఎక్కారు. అంతేకాదు లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా గత పార్లమెంట్ సెసన్స్ లో పలు కీలక చట్టాల అమలులో కీ రూల్ పోషించనట్టు ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. అంతేకాదు కొత్తగా ఏర్పాటైన లోక్ సభకు ఎన్నికైన తొలి స్పీకర్ గా కూడా ఓం బిర్లా రికార్డు క్రియేట్ చేసారనే చెప్పాలి.


Also read: Redmi Note 13 Pro: 108MP, 200MP కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో విడుదల, ధర ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter