Parliament Speaker Om Birla: పార్లమెంట్ లో జరిగిన ఘటనలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చాలా సీరియస్ అయ్యారు. ఇకపై పార్లమెంట్ ప్రవేశ ద్వారాల వద్ద ధర్నాలప నిషేధం విధించారు. ఇకపై ఎవరు పార్లమెంట్ ప్రవేశ ద్వారాల వద్ద  ధర్నాలపై నిషేధం విధించారు స్పీకర్‌ ఓం బిర్లా.  ఎంపీలు, రాజకీయ నేతలు, విడివిడిగా, బృందంగా ఇకపై ఏవైపు గేట్‌ వద్ద కూడా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదన్నారు. ఇందుకు పార్లమెంట్‌ భద్రతా విభాగం కఠినంగా వ్యవహరించాలన్నారు.  తాజాగా పార్లమెంట్ లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా  పార్లమెంట్ లో భారత రత్న అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర దుమారం రేగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. దీనిపై కేంద్ర హోం మినిస్ట్రీ కార్యాలయం వివరణ ఇచ్చింది. పార్లమెంట్ లో తాను అంబేద్కర్ పై తాను అనని వ్యాఖ్యలను వక్రీకరించినట్టు వివరణ ఇచ్చింది. నిన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ధర్నా నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సింగ్ సారంగీ, ముఖేష్ రాజ్ పుత్ లు పార్లమెంట్ లోపలికి వస్తుండగా.. వీరిని తోసుకుంటూ కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ తోసుకుంటూ వెళ్లడంపై తీవ్ర దుమారం రేగింది. అంతేకాదు ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు.


తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం.. ఒకే ఎన్నిక సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి వెంటనే దానిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తంగా 31 మంది పార్లమెంట్ సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేసారు. ఇందులో లోక్ సభ నుంచి 21 మంది ఎంపీలు.. రాజ్యసభ నుంచి 10 మంది ఎంపిక చేసారు. జేపీసీలో ఉండే లోక్ సభ సభ్యులను ప్రకటించిన స్పీకర్ కార్యాలయం.. రాజ్యసభ సభ్యులను ఎవరెవరినీ నియమించారనేది ఇంకా ఖరారు కాలేదు.


ఈ సంయుక్త పార్లమెంటరీ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం రమేశ్ సహా మరో ఇద్దరికి చోటు దక్కింది. మరోవైపు ఈ కమిటీలో లోక్ సభకు తొలిసారి ఎన్నికైన ప్రియాంక గాంధీ వాద్రాకు చోటు కల్పించడం విశేషం.


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.