Lok Sabhas Election Polls 2024: గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమికి ఈ సారి మాత్రం అనుకున్నంత రేంజ్ లో సీట్లు దక్కలేదు. అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదం 293 సీట్ల వరకే ఆగిపోయింది. కానీ కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల అభ్యర్ధులు మెజారిటీల్లో ఈ ఎన్నికల్లో  రికార్డు క్రియేట్ చేసారు. మధ్యప్రదేశ్ లోని ఇందౌర్ లోక్ సభ స్థానంలో బీజేపీ కాండిడేట్ శంకర్ లాల్వానీ  తన సమీప బీఎస్పీ అభ్యర్ధిపై  11.75 లక్షల మెజారిటీతో గెలుపొంది రికార్డు క్రియేట్ చేసాడు. ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీ సాధించిన టాప్ 5 నేతల్లో ఎక్కుమ మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారే కావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు జరనల్ ఎలక్షన్స్ లో మహారాష్ట్రలోని బీడ్ లోక్ సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్ధి ప్రీతమ్ ముండే 2014లో 6.96 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా ఆ రికార్డును మధ్యప్రదేశ్ లోని బీజేపీ అభ్యర్ధి లాల్వానీ క్రాస్ చేయడం విశేషం. అటు అస్సామ్ లోని ధుబ్రీ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ కాండిడేట్ రకీబుల్ హుస్సేన్ 10.12 లక్షల రికార్డు మెజారితో రెండో స్థానంలో నిలిచారు. ఈయనకు మొత్తం పోలైన ఓట్లలో 14,71,885 ఓట్లు రావడం విశేషం.


మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. విదిశ లోక్ సభ స్థానంలో 8.21 లక్షలు మెజారిటీతో విజయ కేతనం ఎగరేసారు. మొత్తంగా ఈయనకు 16.11 లక్షల ఓట్లు వచ్చాయి.


2019లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో నవసరిలో బీజేపీ లీడర్ సీఆర్ పాి 6.89 లక్షల మెజారిటితో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 7.73 లక్షల మెజారిటీతో తన రికార్డు తానే బద్దలు కొట్టాడు.


కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గాంధీ నగర్ లోక్ సభ స్థానం నుంచి 10.10 లక్షల ఓట్లు పోలయ్యాయి. అందులో ఆయన 7.10 లక్షల మెజారిటీ క్రాస్ కావడం విశేషం.
    
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డైమండ్ హార్బర్ లోక్ సభ సిటింగ్ మమత మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ 7.10 లక్షల మెజారిటీతో జయ కేతనం ఎగరేసాడు.


మధ్య ప్రదేశ్ లోని గుణ లోక్ సభ సీటు నుంచి జ్యతిరాదిత్య సింధియా 5.4 లక్షల మెజారిటీతో గెలుపొందారు.
 
గుజరాత్ లోని వడోదర నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి హేమంగ్ జోషి 5 లక్షల 82 వేల మెజారిటీతో గెలుపొందారు.


తెలంగాణలోని నల్గొండ లోక్ సభ నుంచి బరిలో ఉన్న కుందూరు రఘువీర్ 5.59 లక్షల మెజారిటీతో రికార్డు విజయం సాధించారు. ఆయన మొత్తం పోలైన ఓట్లు 7.84 లక్షలు.


ఖమ్మం లోక్ సభ సీటు నుంచి రామసహాయం రఘురాంరెడ్డి కూడా 4లక్షల 67 వేల మెజారిటీతో పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నాడు. ఈయన మొత్తం 7.76 లక్షలు ఓట్లు పోలయ్యాయి.


మల్కాజ్ గిరిలో భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసిన ఈటల రాజేందర్ 3.91 లక్షల ఓట్ల మెజారిటీతో మంచి విజయం సాధించారు.
 
యూపీలోని రాయబరేలి నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. 3.90 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వయనాడ్ నుంచి  3 లక్షల 64 వేల మెజారిటీతో  రెండు చోట్ల గెలుపొందారు.
 
ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి మూడోసారి పోటీ చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఈసారి 1.52 లక్షల స్పల్ప ఆధిక్యంతో గెలుపొందే అవకాశం ఉంది.


Also read: AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook