Loksabha Elections 2024: దేశంలో 18వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. మే 13 అంటే రేపు నాలుగోదశ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగోదశలో మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 96 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఎన్నికల నిబంధనల్ని ఖాతరు చేయకుండా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వ్యాఖ్యలతో కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లు, మత ప్రాతిపదిక అంశాలు, వ్యక్తిగత ఆరోపణలు, దక్షిణాదీయులు ఆఫ్రికన్లలా కన్పిస్తారనే కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు, అదానీ-అంబానీల నుంచి టెంపోల కొద్దీ నల్లధనం తరలింపు ఆరోపణలు, నిత్యావసరవస్తు ధరలు, పెట్రోలియం ధరలు వంటి అంశాలు ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లాయి. 


నాలుగోదశ ఎన్నికల్లో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, బీహార్ లో 5, జార్ఘండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 8, జమ్ము కశ్మీర్‌లో 1 స్థానానికి ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. ఆ తరువాత మే 20, 25, జూన్ 1న మిగిలిన మూడు దశల ఎన్నికలు జరుగుతాయి. 


సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానందరాయ్, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, బీజేపీ నేతలు పంకజ ముండే, టీఎంసీ నేత మహువా మొయిత్రి తదితరులున్నారు. నాలుగోదశ ఎన్నికలు జరుగుతున్న 96 స్థానాల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 


Also read: AP Election Arrangements: ఏపీ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook