1 Crore Salary for Dog Caretakers: ప్రపంచంలో జంతువుల పట్ల ప్రేమతో ఉండేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కుక్కలంటే ఇష్టపడేవారి గురించి చెప్పనవసరమే లేదు. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 100 మందిలో కనీసం 20 మందైనా అయినా కుక్కలను పెంచుకుంటున్నారు. అయితే కుక్కలను పెంచుకోవాలంటే వాటిని పెంచగలిగే రేంజ్ లో ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల జాతులకు చెందిన కుక్కలున్నాయి. ఇందులో కొన్ని మనం తినగలిగే ఆహారాలను పెడితే తింటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరికొన్ని మాత్రం సపరేట్గా వాటికి తయారు చేసిన ఆహారాలను మాత్రమే తింటాయి. పెంపుడు కుక్క పట్ల ప్రేమ ఉండేవారు డబ్బులు లెక్క చేయకుండా వాటికి కావాల్సిన ఆహారాలను కొనిపెడతారు. అంతేకాకుండా ప్రేమ చూపించేందుకు వివిధ రకాల దుస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇలాంటి ఓ వ్యక్తి ఏకంగా కుక్కను చూసుకుంటే రూ. కోటి రూపాలు గల ప్యాకేజీని శాలరీగా ఆఫర్ చేశారు. ఇంతకి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో..ఇలా ఆఫర్‌ చేయడానికి కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


లండన్‌ చెందిన ఒక బిలియనీర్‌  తన కుక్కను చూసుకోవడానికి ఏకంగా కోటి రూపాయల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ చేయడంతో నెట్టింట నిలిచాడు. సాధరంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. మంత్‌లీ వచ్చే ఆ చిన్న శాలరీతోనే సర్దుకుపోతు ఉంటారు. అయితే ఇలాంటి వారికి లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుక్కను చూసుకునేవారికి రూ. కోటి ప్యాకేజీని ఆఫర్‌ చేశారంటే మామూలేనా?. అయితే అతని కుక్కలంటే చాలా ఇష్టమని.. ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న రెండు కుక్కలను చూసుకుంటే సంవత్సరానికి రూ. కోటి ప్యాకేజీ కింద ఇస్తానని ఆఫర్‌ చేశాడు.


Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్ 


అంతేకాకుండా కుక్కలను చూసుకునేవారికి 42 రోజులు సెలవులతో పాటు వాటిని ఎటు తీసికెళ్తే ఆ ప్రదేశాలకు లగ్జరీ జెట్‌లో ప్రయాణించే ఛాన్స్‌ కూడా ఉందని తెలిపారు. ఈ ప్రయాణాల్లో భాగంగా భోజనంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చుతున్నట్లు పేర్కోన్నారు. ఈ జాబ్‌ చేసేవారు సంపన్నులతో మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయట.


ఉద్యోగంలో ఏం చేయాల్సి ఉంటుందో తెలుసా?:
ఈ ఉద్యోగంలో చేరేవారు జాబ్‌లో భాగంగా ప్రతి రోజు కుక్కలకు ఆహారం అందివాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాటినికి జబ్బులు చేసినప్పుడు డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి..వాటికి ప్రతి రోజు స్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా రోజు కుక్కలకు అవసరమైన పనులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసేవారికి కండీషన్స్‌ కూడా పెట్టారు. ఈ జాబ్‌ చేసేవారికి కుక్కల గురించి తప్పకుండా తెలిసి ఉండాలని, అవి తినే ఆహార పదార్థాలపై పూర్తి అవగాహణ ఉండాలని తెలిపారు. అంతేకాకుండా ఈ ఉద్యోగం పొందిన వారు తన జీవితం కంటే కుక్కలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందట. 


Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి