భాతర్‌లో జైళ్ల పరిస్థితి బాగా లేదన్న కారణాన్ని సాకుగా చూపి తమ దేశంలో తలదాచుకున్న నేరగాళ్లను అప్పగించేలమని భారత్‌కు లండన్ కోర్టు తేల్చిచెప్పింది. వివారాల్లోకి వెళ్లినట్లయితే.. 2000లో సౌతాఫ్రికా క్రికెటర్ హ్యాన్సీ క్రోన్జేకు సంబంధమున్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సంజీవ్ కుమార్ చావ్లా అనే బుకీ, లండన్ లో తలదాచుకుని ఉండగా, అతని అప్పగింతపై సుదీర్ఘకాలంగా వాదనలు జరిగాయి. ఈ విషయంలో విచారణ జరిగిన కోర్టు ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అదేమంటే గతంలో భారత సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాలను ఉటంకిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు భారత్ జైళ్ల పరిస్థితిపై స్పందిస్తూ ఇండియాలోని జైళ్లలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పరిమితికి మించిన ఖైదీలను ఒకే గదిలో కుక్కుతున్నారు. వారికి భద్రత కరవవుతోందని వ్యాఖ్యనించింది. 


మాల్యా సహా మిగితా తీర్పులపై ప్రభావం...
ఇండియాలో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, లండన్ లో ఆశ్రయం పొందుతున్న మాల్యా కేసుతో సహా ప్రస్తుతం బ్రిటన్‌లో 12 నేరస్తుల అప్పగింత కేసుల్లో విచారణ జరుగుతోంది. ఈ సంజీవ్ కుమార్ కేసులో తీర్పునే మిగతా కోర్టులూ అనుసరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని సమాచారం. మాల్యా,లిలిత్ మోడీ విషయంలోనూ ఇదే జరగవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.